Ram Miriyala Folk Song: యూట్యూబ్‌ను ఊపేస్తోన్న రామ్ మిర్యాల కొత్త ఫోక్ సాంగ్.. మీరూ చూశారా?

'ఊరెళ్లిపోతా మామా' అంటూ ఒక్కసారిగా తెలుగు రాష్ట్రాల్లో బాగా ఫేమస్ అయ్యాడు రామ్ మిరియాల అలియాస్ చౌరస్తా రామ్. ఇక 'మాయ.. అంతా మాయ' అంటూ తెలుగు కుర్రకారును ఓ రేంజ్ లో ఉర్రూతలూగించాడు. ఇక సినిమల్లోనూ పాటలు పాడుతున్న రామ్ మిరియాల గొంతు నుంచి మరో కొత్త సాంగ్ వచ్చేసింది.

Ram Miriyala Folk Song: యూట్యూబ్‌ను ఊపేస్తోన్న రామ్ మిర్యాల కొత్త ఫోక్ సాంగ్.. మీరూ చూశారా?
Ram Miriyala New Telangana Folk Song

Updated on: Feb 02, 2026 | 5:44 PM

ప్లే బ్యాక్ సింగర్ గా, మ్యూజిక్ కంపోజర్ గా, సాంగ్ రైటర్ గా.. ఇలా తెలుగు సినిమా ఇండస్ట్రీలో మల్టీ పుల్ ట్యాలెంటెడ్ పర్సన్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు రామ్ మిరియాల అలియాస్ చౌరస్తా రామ్. మొదట ఫోక్ సాంగ్స్ తో ఫేమస్ అయిన ఇతను ఆ తర్వాత సింగర్ గా తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. బ్రోచేవారెవరురా, మిడిల్ క్లాస్ మెలోడీస్, జాతి రత్నాలు, పాగల్, పుష్పక విమానం, భీమ్లా నాయక్, టిల్లు, వాల్తేరు వీరయ్య, బలగం, దసరా, దాస్ కీ ధమ్కీ, నా సామిరంగ, టిల్లు స్వ్కేర్.. ఇలా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో పాటలకు ప్రాణం పోశాడు రామ్. ఇక లేటెస్ట్ గా ఛాంపియన్ లో అతను పాడిన గిర గిర సాంగ్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం సినిమా పాటలతో బిజీ బిజీగా ఉంటోన్న రామ్ మిరియాల చాలా గ్యాప్ తర్వాత ఓ ఫోక్ సాంగ్ తో అభిమానుల ముందుకు వచ్చాడు.

సంక్రాంతి పండగ, కోళ్ల పందాల నేపథ్యంలో రామ్ మిరియాల పాడిన ఈ ఫోక్ సాంగ్ ఇప్పుడు సంగీతాభిమానులను బాగా ఆకట్టుకుంటోంది. కోకోకొక్క‌రోకో.. కోడి గ‌ట్టిగా కూయ‌కే ఎక్క‌డికైనా పారిపో.. దొంగ కోళ్ల బ్యాచ్ దిగింద‌మ్మా పారిపో’ అని లిరిక్స్ తో సాగే ఈ సాంగ్ ఇప్పుడు యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది. ఎప్పటిలాగే ఈ సాంగ్ లో రామ్ మిర్యాల వాయిస్ హైలెట్ గా నిలిచింది. అలాగే కాన్సెప్ట్ కూడా కొత్తగా ఉంది. సాంగ్ విజువల్స్ కూడా సూపర్బ్ గా ఉన్నాయి. ఈ పాట ఒక్క‌ సారి వింటే చాలు నాలుగైదు మార్లు రిపీట్ చేయ‌క మాన‌రు. మరి యూట్యూబ్ ను షేక్ చేస్తోన్న ఈ ఫోక్ సాంగ్ పై మీరూ ఒక లుక్ వేయండి.

రామ్ మిరియాల కోడి సాంగ్.. వీడియో ఇదిగో..

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.