
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏది చేసిన సంచలనమే.. ఒకప్పుడు స్టార్ దర్శకుడిగా పేరున్న ఆర్జీవీ ఇప్పుడు వివాదాలతో సావాసం చేస్తున్నారు. బోల్డ్ కంటెంట్ తో ఆయన తెరకెక్కించే సినిమాలు అయన పై విమర్శలు కురిసేలా చేస్తున్నాయి. ఇక బయోపిక్‌ల పేరుతో రాజకీయ నాయకుల పై సినిమాలు తీసి వార్తల్లో నిలుస్తున్నారు ఆర్జీవీ. ఇటీవల ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా వ్యూహం అనే సినిమా తెరకెక్కించాడు. అలాగే ఇప్పుడు శపధం అనే సినిమాను రిలీజ్ చేయండని రెడీ అవుతున్నాడు ఆర్జీవీ. ఇదిలా ఉంటే మొన్నామధ్య ఓ అమ్మాయి గురించి ఆర్జీవీ గూగుల్ ను గాలించిన విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో చూసి ఆ అమ్మాయి ఎవరో చెప్పండి అంటూ తన ఫాలోవర్స్ ను అడిగారు ఆర్జీవీ.
మొత్తానికి ఆ అమ్మాయిని కనిపెట్టి ఆమెతో సినిమా కూడా మొదలు పెట్టేశారు. ఆమె ఆరాధ్యదేవి. కేరళకు చెందిన ఈ అమ్మడు రకరకాల ఫోటో షూట్స్ తో వీడియోలతో సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తుంటుంది. ముఖ్యంగా చీరకట్టులో ఈ చిన్నది సినిమా హీరోయిన్స్ ను సైతం బీట్ చేసేలా ఉంటుంది. చూడచక్కని రూపం. ఆకర్షించే కళ్లతో కుర్రాళ్ళ మతిపోగొడుతోంది ఆరాధ్య. ఆమె అందానికి ఫిదా అయిన ఆర్జీవీ తనతో శారీ అనే సినిమా చేస్తున్నారు.
మొదట్లో ఆమె రీల్స్ ను ఆర్జీవీ తెగ షేర్ చేసేవారు. ఈ మధ్య కాస్త బిజీ అవ్వడంతో ఆరాధ్య ఫోటోలను, వీడియోలను షేర్ చేయడం తగ్గించారు వర్మ. తాజాగా ఆరాధ్య దేవి లేటెస్ట్ ఫోటో ఒకటి షేర్ చేశారు ఆర్జీవీ. మొన్నటి దాకా చీరలో పద్దతిగా కనిపించిన ఆరాధ్య ఇప్పుడు తన గ్లామర్ తో కేకపోట్టించింది. అంతే కాదు ఆర్జీవీ ఓ గూగుల్ డ్రైవ్ లింక్ ను కూడా షేర్ చేశారు. అందులో ఆరాధ్య ఫోటోలు మాములుగా లేవు.. గ్లామర్ షోతో రచ్చ లేపింది ఈ బ్యూటీ. ఓ రేంజ్ లో వయ్యారాలు వడ్డిస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది. ఈ ఫోటోలు చూసిన నెటిజన్స్ షాక్ అవుతున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.