RGV: స్టార్‌లా ఫీల్ అవ్వకు.. దెబ్బైపోతావ్ అని అతని అప్పడే చెప్పా.. వినలేదు

సంచలన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న రామ్ గోపాల్ వర్మ చేసే కామెంట్స్ నిత్యం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంటాయి. దర్శకుడిగా ఒక వెలుగు వెలిగిన ఆర్జీవీ.. ఇప్పుడు అంతగా సక్సెస్ లు అందుకోలేకపోతున్నారు. ఆయన ఏం చేసినా అది ఓ పెద్ద వార్తే అవుతుంది.

RGV: స్టార్‌లా ఫీల్ అవ్వకు.. దెబ్బైపోతావ్ అని అతని అప్పడే చెప్పా.. వినలేదు
Rgv

Updated on: Apr 25, 2026 | 12:23 PM

రామ్ గోపాల్ వర్మ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యూత్ లో ఆర్జీవీ విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ఆయనను రోల్ మోడల్ గా తీసుకున్నవారు చాలా మంది ఉన్నారు. ఆయన మాటలకు ఆయన ఫిలాసఫీలకు యూత్ బాగా కనెక్ట్ అవుతూ ఉంటారు. కాగా ఓ ఇంటర్వ్యూలో సినీ రంగంలో స్టార్‌డమ్, అంచనాలు గురించి పంచుకున్నారు. ఒక నటుడి కెరీర్ గ్రాఫ్ ఎంత అనూహ్యంగా ఉంటుందో వివరించడానికి ఆయన మనోజ్ బాజ్‌పాయ్, హృతిక్ రోషన్ ఉదాహరణలను ప్రస్తావించారు. సత్యా సినిమా తర్వాత నటుడు మనోజ్ బాజ్‌పాయ్ ఎదుర్కొన్న పరిస్థితిని ఆర్జీవీ వివరించారు. “భిక్కు మాత్రే” అనే పాత్రకు వచ్చిన ప్రజాదరణను తన వ్యక్తిగత స్టార్‌డమ్‌గా మనోజ్ భావించారని ఆర్జీవీ తెలిపారు. ఒక అవార్డుల కార్యక్రమంలో వేల మంది భిక్కు మాత్రే” అని అరుస్తుంటే, తాను షారుఖ్, సల్మాన్‌ల కన్నా పెద్ద స్టార్ అయిపోయానని మనోజ్ భావించినట్లు తెలిపారు. అయితే, ఆర్జీవీ అప్పుడు మనోజ్‌కు ఒక స్పష్టమైన సలహా ఇచ్చారట..

ఇది కూడా చదవండి: డార్లింగ్ సాంగ్‌ను రీ క్రియేట్ చేశారు.. నెటిజన్స్ కామెంట్స్ మాత్రం.. అబ్బో..!!

“నీ క్యారెక్టర్ పేరుతో పిలుస్తున్నారు, నీ పేరుతో పిలవట్లేదు. షారుఖ్ ఖాన్ ఇన్ని సూపర్ డూపర్ హిట్లు ఇచ్చాడు.. కానీ ఏ సినిమాలో ఏ క్యారెక్టర్ పేరో ఎవరికీ తెలీదు. ఆ స్టార్‌డమ్‌కి, సినిమా హిట్ అయినప్పుడు క్యారెక్టర్‌కు వచ్చిన పేరుకి కన్ఫ్యూజ్ అవ్వద్దు.” అని చెప్పా అన్నారు ఆర్జీవీ. ఒకవేళ మనోజ్ సోలో హీరోగా సినిమాలు చేస్తే అది ప్రయోజనకరంగా ఉండదని, “సత్యా” లాంటి సినిమా లేదా “భిక్కు మాత్రే” లాంటి రోల్ మళ్లీ రాదని ఆర్జీవీ తెలిపారట. ఆర్జీవీ ఇచ్చిన సలహాను మనోజ్ బాజ్‌పాయ్ పట్టించుకోలేదట. సోలో హీరోగా నాలుగు, ఐదు సినిమాలు చేసి విఫలమయ్యారట. తన కెరీర్ మళ్లీ గాడిన పడటానికి దాదాపు పదేళ్లు పట్టిందని ఆర్జీవీ వివరించారు. ఈ సంఘటన తర్వాత, ఆర్జీవీ చెప్పిన మాటలు నిజమయ్యాయని ఒక మిత్రుడు గుర్తుచేసుకున్నప్పుడు, ఆర్జీవీ తాను ఇలాంటి విషయాలు పదిమందికి చెప్తానని, అందులో తొమ్మిది విఫలమవుతాయని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: ఎంత పని చేశావ్ సామి..!! రెమ్యునరేషన్ కారణంగా ప్రభాస్ సినిమాకు నో చెప్పిన నటుడు..

అంచనాల వైఫల్యాన్ని ఉదహరిస్తూ ఆర్జీవీ తన వ్యక్తిగత అనుభవాలను కూడా పంచుకున్నారు. హృతిక్ రోషన్ స్టార్ అవ్వడని తాను అప్పట్లో చెప్పానని, అలాగే మోహిత్ అనే వ్యక్తి స్టార్ అవుతాడని తాను పరిచయం చేశానని కానీ అది జరగలేదని అంగీకరించారు. “నేనెవడ్ని?” అని ప్రశ్నించుకుంటూ, అంచనాలు ఎంతవరకు నిజమవుతాయో ఎవరూ చెప్పలేరని ఆయన అభిప్రాయపడ్డారు. ఒకవేళ మనోజ్ బాజ్‌పాయ్‌కు తాను సలహా ఇచ్చిన తర్వాత “ఫూల్ ఔర్ కాంటే” లాంటి రెండు, మూడు సూపర్ హిట్లు వచ్చి ఉంటే, మనోజ్ అజయ్ దేవగన్‌లాగా స్టార్ అయి ఉండేవాడని, అప్పుడు తన సలహా తప్పు అయ్యేదని ఆర్జీవీ తెలిపారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి: ఆమెకు రోజుకు 50సార్లు ఐ లవ్ యూ చెప్పేవాడ్ని.. ఆ హీరోయిన్ కోపంతో వెళ్ళిపోయింది

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us