Ram Charan : నా జీవితంలో నాన్నే రియల్ హీరో.. ఆ విషయంలో నాన్ననే ఫాలో అవుతా.. రామ్ చరణ్..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆర్ఆర్ఆర్ తర్వాత ప్రపంచవ్యాపంగా గుర్తింపు తెచ్చుకున్న చరణ్ సినిమాల కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం చరణ్ పెద్ది చిత్రంలో నటిస్తున్నారు. తాజాగా ఎస్క్వై్ర్ ఇండియా మ్యాగజైన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

Ram Charan : నా జీవితంలో నాన్నే రియల్ హీరో.. ఆ విషయంలో నాన్ననే ఫాలో అవుతా.. రామ్ చరణ్..
Chiranjeevi, Ram Charan

Updated on: Apr 16, 2026 | 11:41 PM

మెగాస్టార్ చిరంజీవి, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌ల మధ్య ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వెండితెరపైనే కాకుండా నిజ జీవితంలోనూ వీరిద్దరూ తండ్రీకొడుకులుగా అందరికీ ఆదర్శంగా నిలుస్తుంటారు. తాజాగా ఎస్క్రైర్ ఇండియా కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన తండ్రి చిరంజీవి గురించి రామ్ చరణ్ చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రామ్ చరణ్ మాట్లాడుతూ, తన జీవితంలో నిజమైన హీరో తన తండ్రి చిరంజీవి అని గర్వంగా చెప్పుకున్నారు. “నాన్న వారసత్వాన్ని మేము చాలా సులభంగానే అందిపుచ్చుకున్నాం. ఎంత స్టార్‌డమ్ ఉన్నా ఇంటి దగ్గర మాత్రం ఆయన అందరి తండ్రుల్లాగే చాలా సింపుల్‌గా ఉండేవారు. అదే ఆయనలో నాకు నచ్చే అత్యంత ప్రత్యేకమైన విషయం” అని చరణ్ తెలిపారు.

సినిమాల కోసం చిరంజీవి పడే కష్టాన్ని చరణ్ గుర్తు చేసుకున్నారు. షూటింగ్స్ సమయంలో రోజుకు కేవలం నాలుగు గంటలు మాత్రమే నిద్రపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయని, పని పట్ల ఆయనకు ఉన్న అంకితభావం తనకు ఎప్పుడూ స్ఫూర్తిదాయకమని చెప్పారు. ఇంత బిజీ షెడ్యూల్‌లో కూడా ఆయన కుటుంబాన్ని ఎప్పుడూ విస్మరించలేదని, వరుస షూటింగ్స్ నుండి మూడు రోజులు విరామం దొరికినా, ఆ సమయాన్ని పూర్తిగా కుటుంబ సభ్యులతో గడపడానికి కేటాయించేవారని వెల్లడించారు.

పనిని, కుటుంబాన్ని ఎలా సమన్వయం చేసుకోవాలో (Work-Life Balance) తన తండ్రిని చూసే నేర్చుకున్నానని, ఇప్పుడు తాను కూడా అదే బాటలో నడుస్తున్నానని రామ్ చరణ్ స్పష్టం చేశారు. మెగాస్టార్‌గా కోట్ల మంది అభిమానాన్ని సంపాదించుకున్నా, వ్యక్తిగత జీవితంలో ఒక సామాన్యుడిగా ఉండటం చిరంజీవి గొప్పతనమని ఆయన అన్నారు. ‘‘ఈ ప్రపంచం ఎప్పుడూ విమర్శలు, నెగెటివిటీ, కొన్నిసార్లు అవహేళన చేయడానికి సిద్ధంగా ఉంటుంది’ అని నాన్న చెబుతూ ఉంటారు. ఆత్మగౌరవం, మన ఆలోచనాధోరణి, నమ్మిన దానికి కట్టుబడి ఉండే తత్వం మనల్ని దృఢంగా ఉండేలా చేస్తాయి. మనపై మనకు నమ్మకం ఉంటే, ఎవరూ మనల్ని ఏమీ చేయలేరు’’ అని చరణ్‌ అన్నారు. ప్రస్తుతం చరణ్ పెద్ది చిత్రంలో నటిస్తున్నారు. ఏప్రిల్ 30న విడుదల కావాల్సిన ఈ మూవీ వాయిదా పడింది.

ఎక్కువ మంది చదివినవి :  Monalisa Bhosle: మోనాలిసా మిస్సింగ్.. సెల్ఫీ వీడియో రిలీజ్ చేసిన ఫర్మాన్ ఖాన్..

ఎక్కువ మంది చదివినవి : Prasad Behara : విరాజితతో సిరీస్ ఆపేయడానికి కారణం ఇదే.. అసలు విషయం చెప్పిన ప్రసాద్ బెహరా..

Follow Us