Ramcharan: మంచి మనసు చాటుకున్న రామ్‌చరణ్‌.. తనను కలిసేందుకు వచ్చిన బాలుడు కన్నీళ్లు పెట్టుకోవడంతో..

చెర్రీ బయటకు వెళితే చాలు ఆయనతో కలిసి సెల్ఫీలు, ఫొటోలు దిగేందుకు ఫ్యాన్స్‌ ఎగబడుతుంటారు. రామ్‌చరణ్‌ కూడా ఎంతో ఓపికతో ఫ్యాన్స్‌తో ఫొటోలు దిగుతుంటారు. అయితే కొన్నిసార్లు భద్రతా కారణాలతో ఫ్యాన్స్‌ను దగ్గరకు రానీయరు సెక్యూరిటీ సిబ్బంది.

Ramcharan: మంచి మనసు చాటుకున్న రామ్‌చరణ్‌.. తనను కలిసేందుకు వచ్చిన బాలుడు కన్నీళ్లు పెట్టుకోవడంతో..
Ramcharan

Updated on: Feb 13, 2023 | 3:45 PM

మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్‌కు ఉన్న ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మెగాస్టార్‌ చిరంజీవి వారసుడిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. వరుస హిట్లతో టాలీవుడ్‌ టాప్‌ హీరోల్లో ఒకరిగా నిలుస్తున్నారు. ఇక రాజమౌళి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాతో పాన్‌ ఇండియా స్టార్‌గా మారిపోయారాయన. ఈ సినిమా తర్వాత చెర్రీ పాపులారిటీ అమాంతం పెరిగిపోయింది. సోషల్‌ మీడియాలోనూ అంతకంతకూ ఫాలోయింగ్‌ పెరుగుతోంది. ఇక చెర్రీ బయటకు వెళితే చాలు ఆయనతో కలిసి సెల్ఫీలు, ఫొటోలు దిగేందుకు ఫ్యాన్స్‌ ఎగబడుతుంటారు. రామ్‌చరణ్‌ కూడా ఎంతో ఓపికతో ఫ్యాన్స్‌తో ఫొటోలు దిగుతుంటారు. అయితే కొన్నిసార్లు భద్రతా కారణాలతో ఫ్యాన్స్‌ను దగ్గరకు రానీయరు సెక్యూరిటీ సిబ్బంది. తాజాగా రామ్‌చరణ్‌ అభిమానికి కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఓ బాలుడికి మెగా పవర్‌స్టార్‌ అంటే విపరీతమైన అభిమానం. ఎప్పటికైనా తమ అభిమాన హీరోను కలవాలని, కలిసి ఫొటో దిగాలని అనుకుంటున్నాడు.

ఈక్రమంలో రామ్‌చరణ్‌ తన సమీప స్థలంలో ఉన్నాడని తెలుసుకుని చకాచకా వెళ్లిపోయాడు. సెక్యూరిటీ సిబ్బందిని దాటుకుంటూ హీరో దగ్గరి వరకు వెళ్లాడు. అయితే చెర్రీని కలిసే క్షణం రాగానే సెక్యూరిటీ సిబ్బంది గమనించి అతనిని అడ్డుకున్నారు. మెగా పవర్‌స్టార్‌ దగ్గరకు వెళ్లనివ్వలేదు. దీంతో ఆ బాలుడు కన్నీటి పర్యంతమయ్యాడు. ఇది గమనించిన రామ్‌ చరణ్‌ సెక్యూరిటీ సిబ్బందికి నచ్చజెప్పి బాలుడిని తన దగ్గరకు పంపమన్నాడు. ఫొటో కూడా దిగుదామన్నాడు. అలా చెర్రీతో కలిసి ఫొటో దిగుతున్న సమయంలో ఆ బాలుడు భావోద్వేగానికి గురయ్యాడు. కంటతడి కూడా పెట్టకున్నాడు. దీంతో చెర్రీ ఆ బాలుడిని ఓదార్చాడు. ఏడవొద్దని చెప్పాడు. తన అభిమాన హీరో స్వయంగా చెప్డంతో ఆ బాలుడు తన కళ్లను తుడుచుకున్నాడు. చరణ్‌తో ఫొటో దిగి సంతోషంతో వెళ్లిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన అభిమానులు, నెటిజన్లు చెర్రీ మంచి మనసుపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us