ప్రభాస్ సరసన ఛాన్స్ వచ్చింది.. మిస్టర్ ఫర్ఫెక్ట్ సినిమాలో హీరోయిన్‏గా నేనే చేయాల్సింది.. కానీ..

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా, దశరథ్ దర్శకత్వంలో వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ మూవీ 'మిస్టర్ పర్ఫెక్ట్' (Mr. Perfect). 2011లో విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా, క్లాసిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా నిలిచింది. ఇందులో కాజల్ అగర్వాల్, తాప్సీ పన్ను, ప్రకాష్ రాజ్, కే విశ్వనాథ్, మురళీ మోహన్, నాజర్, బ్రహ్మానందం తదితరులు కీలకపాత్రలు పోషించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు.

ప్రభాస్ సరసన ఛాన్స్ వచ్చింది.. మిస్టర్ ఫర్ఫెక్ట్ సినిమాలో హీరోయిన్‏గా నేనే చేయాల్సింది.. కానీ..
Mr. Perfect Movie

Updated on: May 27, 2026 | 7:25 PM

టాలీవుడ్‌లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా దూసుకుపోయిన పంజాబీ ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్, తన కెరీర్ ప్రారంభంలో ఎదుర్కొన్న ఆసక్తికరమైన, ఆశ్చర్యకరమైన విషయాలను ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ముఖ్యంగా యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన బ్లాక్‌బస్టర్ హిట్ ‘మిస్టర్ పర్ఫెక్ట్’ సినిమా గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. రకుల్ మాట్లాడుతూ, తాను ఢిల్లీలో మ్యాథ్స్ ఆనర్స్ చదువుకుంటూ మోడలింగ్ చేస్తున్న రోజుల్లోనే సినిమా అవకాశాలు వచ్చాయని తెలిపారు. జాతకాలను ఎక్కువగా నమ్మే ఒక కన్నడ చిత్ర బృందం, ఆమె పుట్టిన తేదీ చూసి భవిష్యత్తులో పెద్ద స్టార్ అవుతుందని నమ్మి, హీరోయిన్‌గా అవకాశం ఇచ్చారట. మొదట్లో సౌత్ ఇండస్ట్రీ గురించి ఏమాత్రం అవగాహన లేని రకుల్, ఆ సినిమా చేయడానికి నిరాకరించారు. కానీ, అప్పట్లో తన పాకెట్ మనీ కేవలం రూ. 2000 మాత్రమేనని, కేవలం నెల రోజులు నటిస్తే లక్షల్లో రెమ్యూనరేషన్ ఇస్తామని చెప్పడంతో.. కాలేజీ స్నేహితులందరిలోనూ తనకే మొదటి కారు ఉంటుందనే ఆశతో ఆ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చానని సరదాగా గుర్తుచేసుకున్నారు.

ఎక్కువ మంది చదివినవి : Vantalakka: నా భర్త నాతో కలిసి ఉండడు.. కారణం అదే.. కార్తీక దీపం వంటలక్క కామెంట్స్..

అయితే, తెలుగులో రకుల్ ప్రీత్ సింగ్ కెరీర్ అనుకున్నంత సులభంగా సాగలేదు. ప్రభాస్ హీరోగా వచ్చిన ‘మిస్టర్ పర్ఫెక్ట్’ సినిమానే నిజానికి రకుల్ టాలీవుడ్ డెబ్యూ మూవీ కావాల్సింది. ఈ సినిమా కోసం ఆమె సంతకం చేసి, దాదాపు నాలుగు రోజుల పాటు షూటింగ్‌లో కూడా పాల్గొన్నారు. కానీ, కొన్ని కారణాల వల్ల మేకర్స్ ఆమెను ఆ ప్రాజెక్ట్ నుండి తొలగించి, మరో హీరోయిన్‌ను తీసుకున్నారు. అప్పట్లో సినిమా ఇండస్ట్రీ విలువ, సక్సెస్ ప్రాధాన్యత తెలియకపోవడంతో ఆ రిజెక్షన్‌ను తాను పెద్దగా పట్టించుకోలేదని రకుల్ చెప్పారు. ఆ తర్వాత మరికొన్ని సినిమాల్లోనూ ఇలాంటి చేదు అనుభవాలే ఎదురయ్యాయని, దాంతో పరిశ్రమలో తనపై నెగిటివ్ స్టాంప్ పడకుండా ఉండటానికి ముంబై వెళ్లి మిస్ ఇండియా పోటీల్లో పాల్గొన్నట్లు వివరించారు.

ఎక్కువ మంది చదివినవి : Srikanth : ఆ హీరోయిన్ నాకు చాలా స్పెషల్.. నటనలో ఆమె నాకు పోటీగా ఉండేది.. హీరో శ్రీకాంత్..

ఆ తర్వాత వచ్చిన ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ సినిమా తన కెరీర్‌ను పూర్తిగా మార్చేసిందని రకుల్ ఆనందం వ్యక్తం చేశారు. “మొదట్లోనే పెద్ద సక్సెస్ వచ్చి ఉంటే బహుశా నా తలకెక్కేదేమో, కష్టాలు పడి పైకి రావడం వల్లే ఇప్పుడు ప్రతి అవకాశాన్ని ఎంతో గౌరవిస్తున్నాను” అంటూ రకుల్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం రకుల్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : ఆ హీరో చాలా అందగాడు.. టాలెంట్ ఉంది.. కానీ స్టార్ హీరో కాలేకపోయాడు.. ఎక్కడ తప్పు చేశాడంటే..

రకుల్ ప్రీత్ సింగ్ ..

ఎక్కువ మంది చదివినవి : ఏంటీ.. ఈ నటుడు వైఎస్ఆర్ క్లోజ్ ఫ్రెండ్ ఆ.. ? సినిమాలకు బలవంతంగా తీసుకెళ్లేవారట.

Follow Us