రాఖీ పౌర్ణమి..అక్కా తమ్ముళ్లకు.. అన్నా చెల్లెళ్ల ప్రేమకు ప్రతీక. సోదరీసోదరుల మధ్య ఉండే ఆత్మీయత, అనురాగానికి గుర్తుగా ఈ పండగను జరుపుకుంటారు. జీవిత కాలం సంతోషంగా ఉండాలని సోదరి కోరుకుంటే.. ఎప్పటికీ తనకు తోడుగా రక్షణ ఉంటానని వాగ్దానం చేస్తాడు సోదరుడు. ఈరోజు రాఖీ పౌర్ణమి. దేశవ్యాప్తంగా కులమాతాలకతీతంగా ఈ పండుగను సంతోషంగా జరుపుకుంటున్నారు. ఇక సినీ పరిశ్రమలోనూ సెలబ్రెటీలు తమ సోదరీసోదరులతో ఈ పర్వదినాన్ని జరుపుకుంటున్నారు. ఈ క్రమంలో ఓ క్రేజీ హీరో తన అక్కతో కలిసున్న చిన్ననాటి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పైన ఫోటోను చూశారు కదా. ఎవరో గుర్తుపట్టండి.
తన సోదరితో కలిసి చిరునవ్వులు చిందిస్తూ ఫోటోలకు ఫోజులిస్తున్న ఈ చిన్నోడు ఇప్పుడు స్టార్ హీరో. ముఖ్యంగా అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువే. ఎవరో గుర్తుపట్టండి. ఇటీవలే సూపర్ హిట్ చిత్రంతో ప్రేక్షకులను అలరించిన ఈ హీరో.. ప్రస్తుతం తన తదుపరి ప్రాజెక్ట్ చిత్రీకరణలో బిజీగా ఉన్నారు గుర్తుపట్టండి. ఎవరో..
ఆ ఫోటోకు క్యూట్ గా ఉన్న చిన్నోడు న్యాచురల్ స్టార్ నాని. వాళ్ల అక్కయ్య దీప్తి గంటతో కలిసున్న ఈ చిన్ననాటి జ్ఞాపకాన్ని షేర్ చేస్తూ అభిమానులకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు న్యాచురల్ స్టార్. ఇటీవలే శ్యామ్ సింగరాయ్ చిత్రంతో సూపర్ హిట్ అందుకున్న హీరో ప్రస్తుతం దసరా మూవీలో నటిస్తున్నారు. సింగరేణి బోగ్గు గనుల నేపథ్యంలో వస్తున్న ఈ మూవీలో నాని పక్కా ఊర మాస్ లుక్ లో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదైలన పోస్టర్స్ సినిమాపై క్యూరియాసిటీని పెంచేశాయి. అలాగే ఇందులో నాని సరసన కీర్తి సురేష్ నటిస్తోంది.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.