టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్లలో ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) ఒకరు. బాహుబలి సినిమాతో తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పాడు. ఈ సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్గా మారిపోయాడు రాజమౌళి.. ప్రస్తుతం ఆయన ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల చేసే పనిలో ఉన్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమా కోసం దేశవ్యాప్తంగా అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఈ సినిమా జనవరి 7న విడుదల కావాల్సి ఉండగా… కరోనా కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. రాజమౌళి తన పోస్ట్ ప్రొడక్షన్లో కీలకపాత్ర పోషించిన ఆర్టిస్ట్ క్యాన్సర్తో పోరాడుతుందని.. సాయం చేయాలంటూ విజ్ఞప్తి చేసింది.
బాహుబలి పోస్ట్ ప్రొడక్షన్లో కీలకపాత్ర పోషించిన దేవిక అనే ఆర్టిస్ట్ బ్లడ్ క్యాన్సర్తో పోరాడుతుందని.. వైద్యానికి సహాయం చేయాలని ఆయన తన ట్విట్టర్ ఖాతా ద్వారా అభిమానులకు విజ్ఞప్తి చేశారు. బాహుబలి సినిమా కోస దేవికతో కలిసి పనిచేశాను. ఎన్నో పోస్ట్ ప్రొడక్షన్ పనులకు ఆమె కోర్టినేటర్ గా పనిచేశారు. ఆమె అభిరుచి, అంకితాభావం నిజంగా సాటిలేనివి. కానీ దురదృష్టవశాత్తూ బ్లడ్ క్యాన్సర్ తో పోరాటం చేస్తున్నాను. నేను ఇక్కడ షేర్ చేస్తున్న కెట్టో ఫండ్ రైజింగ్ (నిధుల సమీకరణ) కార్యక్రమానికి మీ వంతుగా సాయం చేయాలని సవినయంగా కోరుతున్నాను అంటూ రాజమౌళి ట్విట్ చేశారు. ఈ పోస్ట్ లో దేవిక తన భర్త, ఇద్దరు పిల్లలతో కలిసి తీసుకున్న ఫోటోను కూడా షేర్ చేశారు. దీంతో ఆమె త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్లు కొందరు నెటిజన్లు కోరగా. మరికొందరు మాత్రం రాజమౌళి ని ట్రోల్ చేస్తున్నారు. కోట్లు సంపాదిస్తున్నారుగా.. మీరు ఎందుకు సాయం చేయరు అంటూ ట్రోల్ చేస్తున్నారు. ఎక్కువ శాతం రాజమౌళి పెద్ద మనసుతో సాయం చేసి ఆదకోవచ్చుగా అంటూ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు
ట్వీట్.
Worked with Devika during Baahubali. She was the coordinator for many post production works. Her passion and dedication is unmatched. Unfortunately, she is battling a blood cancer.
I humbly request to donate funds to the Ketto Campaign shared below. https://t.co/83umbPnI4M
— rajamouli ss (@ssrajamouli) January 29, 2022
Gangubai Kathiawadi: థియేటర్లలోకి గంగూబాయి కతియావాడి.. అలియా భట్ సినిమా రిలీజ్ ఎప్పుడంటే..
Janhvi Kapoor: టాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైన అతిలోక సుందరి తనయ.. ఏ సినిమాతో అంటే..