ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 మరో రెండు రోజుల్లో విడుదల కానుంది. డిసెంబర్ 5న తెలుగుతోపాటు, మలయాళం, తమిళం, కన్నడ, హిందీ భాషలలో రిలీజ్ కానుండడంతో ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, సాంగ్స్ సినిమాపై ఓ రేంజ్ హైప్ క్రియేట్ చేశాయి. ఇక ఇటీవల రిలీజ్ అయిన పీలింగ్స్ సాంగ్ సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది. దీంతో అటు ప్రమోషన్స్, ఇటు అప్డేట్స్ తో జనాలను ఆకట్టుకుంటున్నారు మేకర్స్. ఇప్పటికే దేశ వ్యాప్తంగా ప్రమోషన్స్ వేగం పెంచిన మేకర్స్.. ఇప్పుడు హైదరాబాద్ లో పెద్ద ఎత్తున ఈవెంట్ ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. ఈరోజు సాయంత్రం 6 గంటలకు యూసుఫ్ గూడలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో పుష్ప 2 వైల్డ్ ఫైర్ జాతర పేరుతో ఈవెంట్ నిర్వహించనున్నారు.
ఇప్పటికే ఈ వేడుకకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. మరోవైపు ఆ దారిలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ ఆంక్షలు విధించిన పోలీసులు… ప్రతి క్షణం దగ్గరుండి చూసుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. నార్త్ లో ఈసినిమా క్రేజ్ మాములుగా లేదు. నార్త్ రాష్ట్రాల్లో ఎక్కడ చూసిన పుష్ప 2 పోస్టర్స్ కనిపిస్తున్నాయి. రిలీజ్ డేట్ దగ్గపడుతుండడంతో బ్యాక్ టూ బ్యాక్ ప్రమోషన్స్ చేస్తున్నారు మేకర్స్. ఈ క్రమంలోనే ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతున్న ఓ వీడియో చూసి నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు.
ముంబైలో ఓ మెట్రో ట్రైన్ మొత్తం పుష్ప 2 స్టిక్కర్స్ తో నింపేశారు. ట్రైన్ మొత్తం పుష్ప 2 పోస్టర్స్ అతికించడంతో చూసేందుకు కన్నుల పండగా కనిపిస్తోంది. దీంతో ఈ వీడియోను షేర్ చేస్తూ ఉత్తరాదిలో బన్నీ క్రేజ్ ఇది అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు ఇప్పటికే సెన్సార్ ప్రక్రియ పూర్తైంది.
The Brand is everywhere 🔥🔥
Mumbai Metro wrapped with Pushpa Branding 💥💥
Biggest Indian Film – Biggest Promotions across India #Pushpa2TheRule#Pushpa2TheRuleOnDec5th pic.twitter.com/A7fUY5Qrby
— Sukumar Writings (@SukumarWritings) December 2, 2024
Vijay Sethupathi: విజయ్ సేతుపతి ఇన్ స్టాలో ఫాలో అవుతున్న ఏకైక హీరోయిన్.. ఎవరో తెలుసా..?
Tollywood : గ్యాంగ్‌స్టర్‌తో ప్రేమలో పడి కెరీర్ నాశనం చేసుకున్న హీరోయిన్.. ఇండస్ట్రీకి దూరం..
Actress Gajala: వాసి వాడి తస్సాదియ్యా.. అందాలతో హార్ట్ ఎటాక్ తెప్పిస్తోన్న ఎన్టీఆర్ హీరోయిన్..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.