Akash Puri’s Romantic: ఆకాష్ పూరీ రొమాంటిక్ సినిమాకూడా ఓటీటీ బాట పట్టనుందా.?

పూరీ జగన్నాథ్ కొడుకు ఆకాష్ పూరీ హీరోగా పరిచయం అయ్యి చాలా కాలం అయ్యింది. చాలా సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి ఆకట్టుకున్న ఆకాష్..

Akash Puris Romantic: ఆకాష్ పూరీ రొమాంటిక్ సినిమాకూడా ఓటీటీ బాట పట్టనుందా.?
Akash Puri Romantic

Updated on: May 16, 2021 | 9:51 PM

Akash Puri: పూరీ జగన్నాథ్ కొడుకు ఆకాష్ పూరీ హీరోగా పరిచయం అయ్యి చాలా కాలం అయ్యింది. చాలా సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి ఆకట్టుకున్న ఆకాష్ మెహబూబా సినిమాతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఇప్పుడు రొమాంటిక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధం అయ్యాడు. ఈ  మూవీకి  పూరీ జ‌గన్నాథ్ క‌థ‌, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ స‌మ‌కూరుస్తున్నారు. ఈ సినిమా ద్వారా ఆయ‌న శిష్యుడు అనిల్ పాదూరి డైరెక్ట‌ర్‌గా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. బాలీవుడ్ హాట్ కేతికా శ‌ర్మ హీరోయిన్ గా నటిస్తుంది. ‘ఇస్మార్ట్ శంక‌ర్’ లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ త‌ర్వాత పూరీ జగన్నాథ్ టూరింగ్ టాకీస్‌,పూరీ క‌నెక్ట్స్ బ్యాన‌ర్ల‌ పై పూరీజ‌గ‌న్నాథ్‌, ఛార్మీ కౌర్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కంప్లీట్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కీలక పాత్ర‌లో ర‌మ్య‌కృష్ణ నటిస్తున్నారు. సునీల్ క‌శ్య‌ప్ మ్యూజిక్ స‌మ‌కూరుస్తుండ‌గా, న‌రేష్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే రొమాంటిక్ మూవీ ఓటీటీలో రిలీజ్ కాబోతోందని టాక్ ఫిలింసర్కిల్స్ లో తెగ చక్కర్లు కొడుతుంది. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ కాపీ ఇప్పటికే సిద్దమైందని.. త్వరలోనే ఓటీటీలో రిలీజ్ చేయనున్నారని టాక్. అయితే.. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ లో రాబోతోందని గతంలోనే ప్రచారం జరిగింది. అయితే  తాజాగా నెట్ ఫ్లిక్స్ లో రాబోతుందని అంటున్నారు. ఈ సంస్థ భారీ ఆఫర్ ఇచ్చిందని దీంతో.. ఆకాష్ రొమాంటిక్ నెట్ ఫ్లిక్స్ లోనే స్ట్రీమింగ్ కానుందని అంటున్నారు. త్వరలోనే ఈ విషయం పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Akhanda Movie : కరోనా కారణంగా ఆలస్యం అవుతున్న ‘అఖండ’… బాలయ్య సినిమాకోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్న అభిమానులు..

Bellamkonda Ganesh: బెల్లంకొండ ఫ్యామిలీ నుంచి మరో హీరో.. హిందీ మూవీ రీమేక్ తో ఎంట్రీ ఇవ్వనున్న గణేష్..

Natural Star Nani : నేచురల్ స్టార్ మరోసారి ఓటీటీనే నమ్ముకుంటాడా.. ‘టక్ జగదీష్’ పరిస్థితేంటి..?

Loading...
Unable to load recommendations.
Follow Us