
Puneeth Raj Kumar: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ అకాల మరణంతో యావత్ దక్షిణ భారత సినీ రంగాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యింది. శుక్రవారం పునీత్ గుండెపోటుతో మరణించారు. సూపర్ స్టార్ కు అంతిమ నివాళులు అర్పించేందుకు కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖులు, అభిమానులు బెంగళూరులోని కంఠీరివ స్టేడియానికి చేరుకుంటున్నారు. కొద్దిసేపటి క్రితం బాలకృష్ణ కూడా పునీత్ పార్దీవ దేహానికి నివాళులర్పించారు. ఆయన పార్ధీవ దేహాన్ని చూసి బాలకృష్ణ కన్నీటి పర్యంతమయ్యారు. బాలకృష్ణతో, నిర్మాత సాయి కొర్రపాటి కూడా పునీత్ ని చివరి సారి దర్శించుకున్నారు. బాలకృష్ణ పూజ మాల వేసి నివాళులర్పించారు. పునీత్ రాజ్‌కుమార్ అన్నయ్య శివ రాజ్‌కుమార్ ని బాలకృష్ణ పరామర్శించారు.
పునీత్ మరణంతో బాలకృష్ణ తన పునీత్ రాజ్‌కుమార్‌తో తన జ్ఞాపకాలను పంచుకున్నారు. “నా సోదరుడు పునీత్ రాజ్‌కుమార్ లేరంటే నేను నమ్మలేకపోతున్నానని.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నానని చెప్పారు. బాలకృష్ణ నటించిన గౌతమపుత్ర శాతకర్ణిలో శివ రాజ్‌కుమార్ నటించారు. కర్ణాటకలో సినిమా ప్రమోషన్స్‌లో పునీత్ రాజ్‌కుమార్ కూడా ఈ సినిమా ప్రమోషనల్ ఈవెంట్‌కి హాజరయ్యారు. డాక్టర్ రాజ్ కుమార్ కుటుంబంతో బాలకృష్ణకు మంచి అనుబంధం ఉంది . పునీత్ కు ప్రభుదేవా , రానా వంటి టాలీవుడ్ నటులు నివాళుల్పించారు. ఈరోజు సాయంత్రం తండ్రి సమాధి వద్దనే ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి.
పునీత్ రాజ్‌కుమార్ మరణంతో అతని చిత్రాల గురించి సమీక్షల సంక్షిప్త సంకలనంతో Google నివాళులర్పించింది.
Also Read: శీతాకాలంలో పొడి చర్మం ఉన్నవారు చేయాల్సిన, చేయకూడని పనుల ఏమిటంటే..