Pawan Kalyan: పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు న్యూ ఇయర్ గిఫ్ట్.. పవన్ కొత్త సినిమాపై అధికారిక ప్రకటన.. డైరెక్టర్ ఎవరంటే?

ఓజీ తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతో మన ముందుకు రానున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కల్యాణ్. అయితే దీని తర్వాత పవన్ సినిమాలు చేస్తారా?లేదా? అన్న సందిగ్ధంలో పడ్డారు అభిమానులు. అయితే కొత్త సంవత్సరం కానుకగా పవన్ కొత్త సినిమాను అనౌన్స్ చేశారు.

Pawan Kalyan: పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు న్యూ ఇయర్ గిఫ్ట్..  పవన్ కొత్త  సినిమాపై అధికారిక ప్రకటన.. డైరెక్టర్ ఎవరంటే?
Pawan Kalyan New Movie

Updated on: Jan 01, 2026 | 11:36 AM

ఓ వైపు ఏపీ డిప్యూటీ సీఎంగా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తూనే మరోవైపు తన సినిమాలు పూర్తి చేస్తున్నారు పవన్ కల్యాణ్. గతేడాది ఆయన నటించిన హరి హర వీరమల్లు, ఓజీ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇందులో ఓజీ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. రూ.300 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి 2025లో టాలీవుడ్ లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది. దీని తర్వాత హరీశ్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చేస్తున్నారు పవన్. త్వరలోనే ఈ మూవీ కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే దీని తర్వాత పవన్ సినిమాలు ఆపేస్తారనే ప్రచారం జరిగింది. అయితే ఆ మధ్యన ఓజీ 2 చేస్తానని ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పారు పవన్. ఇప్పుడు న్యూ ఇయర్ ను పురస్కరించుకుని అభిమానులకు మరో శుభవార్త చెప్పారు.

కిక్, రేసుగుర్రం, ధ్రువ సినిమాలతో టాలీవుడ్ లో స్టైలిష్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు సురేందర్ రెడ్డి. కొన్ని రోజుల క్రితం ప్రముఖ నిర్మాత రామ్ తాళ్లూరి నిర్మాణంలో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో పవన్ హీరోగా ఓ సినిమాని ప్రకటించారు. అయితే పవన్ రాజకీయాల్లో బిజీగా ఉండటంతో ఈ ప్రాజెక్టుపై ఎలాంటి అప్ డేట్స్ రాలేదు. ఈ మూవీ ఆగిపోయిందని ప్రచారం కూడా జరిగింది. అయితే ఇప్పుడు ఇదే సినిమాను మళ్లీ అనౌన్స్ చేశారు మేకర్స్. నిర్మాత రామ్ తాళ్లూరి, డైరెక్టర్ సురేందర్ రెడ్డి పవన్ కళ్యాణ్ ని కలిసి దిగిన ఫోటోని షేర్ చేస్తూ ఈ సినిమాని ప్రకటించారు. ‘ నా డ్రీం కొత్త నిర్మాణ సంస్థ, పవన్ కళ్యాణ్ పేరు పెట్టిన సంస్థ జైత్ర రామ్ మూవీస్ బ్యానర్ పై సురేందర్ రెడ్డి, వక్కంతం వంశీ తో కలిసి పవన్ కళ్యాణ్ గారితో సినిమా చేయబోతున్నాను’ అని సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు నిర్మాత రామ్ తాళ్లూరి. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిని చూసి పవన్ ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు.

ఇవి కూడా చదవండి

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.