సినిమా టికెట్ రేట్స్ పెంచడంపై నిర్మాత నట్టికుమార్ అసహనం..  తెలంగాణ హైకోర్టును ఆశ్రయిస్తా అంటూ..

సినీ పరిశ్రమలో టికెట్స్ రగడ మొదలైంది. గత రెండేళ్లుగా తీవ్రంగా నష్టపోయిన సినీ ఇండస్ట్రీ.. థియేటర్స్ యాజమాన్యాలు

సినిమా టికెట్ రేట్స్ పెంచడంపై నిర్మాత నట్టికుమార్ అసహనం..  తెలంగాణ హైకోర్టును ఆశ్రయిస్తా అంటూ..
Nattikumar

Updated on: Dec 26, 2021 | 5:07 PM

సినీ పరిశ్రమలో టికెట్స్ రగడ మొదలైంది. గత రెండేళ్లుగా తీవ్రంగా నష్టపోయిన సినీ ఇండస్ట్రీ.. థియేటర్స్ యాజమాన్యాలు ఇప్పుడిప్పుడే కొలుకుంటున్నాయి. ఇటీవల విడుదలైన అఖండ, పుష్ప సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడమే కాకుండా.. కలెక్షన్స్ సునామి సృష్టించడంతో నిర్మాతలతోపాటు.. థియేటర్స్ యాజమానులకు సైతం ఊరటనిచ్చింది. ఇదిలా ఉంటే.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినిమా టికెట్స్ తగ్గిస్తూ జీవో జారీ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై సినీ ప్రముఖులు అసహనం వ్యక్తం చేయగా.. ఇప్పటికే పలుచోట్ల థియేటర్స్ మూతపడ్డాయి. ఇక మరోవైపు తెలంగాణ ప్రభుత్వం సినిమా విడుదల సమయంలో టికెట్స్ రేట్స్ పెంచుకోవచ్చు అంటూ జీవో జారీ చేసింది సంగతి తెలిసిందే.

తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై పలువురు సినీ ప్రముఖులు కృతజ్ఞతలు తెలిపారు. తాజాగా నిర్మాత నట్టికుమార్ తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం పై అసహనం వ్యక్తం చేశారు. చిత్రపరిశ్రమ అభివృద్ధి కోసం తెలంగాణ రాష్ట్రంలో టికెట్స్ ధరలు పెంచుతూ తీసుకున్న నిర్ణయం పట్ల నట్టికుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో సినిమా టిక్కెట్ల రేట్లు భారీగా పెంచడంతో చిన్న సినిమాలకు అన్యాయం జరుగుతుంది నిర్మాత నట్టికుమార్ అన్నారు. టికెట్స్ రేట్స్ పెంచడం వలన చిన్న సినిమాలకు అన్యాయం జరగడమే కాకుండా.. మల్టీఫ్లెక్స్‏లలో సినిమా చూడాలన్న కల కలగానే మిగిలి పోతుందని నట్టికుమార్ తెలిపారు. సినిమాటోగ్రఫీ యాక్ట్ 1955 నిబంధనలు ప్రభుత్వం జారీ చేసిన జీవోలో లేనే లేవని అన్నారు. చిన్న సినిమాలు కూడా లాభపడే విధంగా తెలంగాణ ప్రభుత్వం ఆలోచించాలని.. పది రోజుల్లోగా చిన్న సినిమాలకు మేలు చేసే నిర్ణయం తీసుకోకపోతే తెలంగాణ హైకోర్టును ఆశ్రయిస్తానని నట్టికుమార్ అన్నారు.

Also Read:  Ram Gopal Varma: ఇదేంది సామీ.. కేక్‏ను ఇలా కట్ చేస్తారా.. వర్మ రచ్చ మాములుగా లేదుగా..

Naveen Polishetty: అఫీషియల్ అనౌన్స్‎మెంట్ వచ్చేసిందిగా.. యూవీ బ్యానర్‏లో నవీన్ పోలిశెట్టి సినిమా.. హీరోయిన్ ఎవరంటే..

Rakul Preet Singh: హ్యాపీ బర్త్ డే మై సన్‌షైన్.. ప్రియుడికి స్వీట్‌గా బర్త్‌ డే విషెస్‌ చెప్పిన పంజాబీ బ్యూటీ..

2022 Mega Heros Movies: కొత్త ఏడాదిలో ఫ్యాన్స్‌కు మెగా హీరోల బోనాంజా.. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు రిలీజ్..

Loading...
Unable to load recommendations.
Follow Us