ప్రాణాలు పణంగా పెట్టి మా యాక్టర్స్ చేస్తారు.. షాకింగ్ వీడియో షేర్ చేసిన కోన వెంకట్

కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ శ్రీ విష్ణు హీరోగా కోన వెంకట్ స్క్రీన్ ప్లే అందించిన సినిమా కామ్రేడ్ కల్యాణ్. నక్సలిజం బ్యాక్గ్రౌండ్ లో వచ్చిన ఈ కామెడీ ఎంటర్టైనర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. కాగా ఈ సినిమా షూటింగ్ లో జరిగిన ఓ షాకింగ్ వీడియోను కోనవెంకట్ షేర్ చేశారు.

ప్రాణాలు పణంగా పెట్టి మా యాక్టర్స్ చేస్తారు.. షాకింగ్ వీడియో షేర్ చేసిన కోన వెంకట్
Comrade Kalyan

Updated on: Oct 12, 2026 | 11:48 AM

టాలీవుడ్ హీరో శ్రీ విష్ణు నటించిన లేటెస్ట్ మూవీ కామ్రేడ్ కల్యాణ్ ఇటీవలే విడుదలై మంచి టాక్ సొంతం చేసుకుంది. సినిమాకు మొదటి షో నుంచి పాజిటివ్ టాక్ వస్తుంది. మహిమ నంబియార్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి జానకీరామ్ దర్శకత్వం వహించారు. మౌత్ టాక్ తోనే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధిస్తుంది. మొదటి రెండు రోజుల్లోనే ఈ చిత్రం రూ.8 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ నేపథ్యంలో సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన షూటింగ్ వీడియోను రచయిత కోన వెంకట్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. కామ్రేడ్ కల్యాణ్ సినిమా షూటింగ్ సమయంలో చోటుచేసుకున్న ఓ ఘటన ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మంగళూరు సమీపంలోని అడవిలో చిత్రీకరణ జరుగుతున్న సమయంలో నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ ప్రమాదవశాత్తూ కింద పడబోయారు. అయితే, వెంటనే అప్రమత్తమైన అక్కడి సిబ్బంది, తోటి వ్యక్తులు ఆయనను పట్టుకుని ప్రమాదం నుంచి కాపాడారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను కోన వెంకట్ తాజాగా అభిమానులతో పంచుకున్నారు.

సినిమా తెరపై కనిపించే సన్నివేశాల వెనుక నటీనటులు ఎంతటి కష్టాన్ని ఎదుర్కొంటారో ఈ వీడియో మరోసారి గుర్తుచేస్తోంది. ప్రేక్షకులను అలరించేందుకు నటీనటులు ప్రాణాలకు తెగించి పనిచేయాల్సి వస్తుందని కోన వెంకట్ తన పోస్టులో పేర్కొన్నారు. సినిమా విజయం సాధించినప్పుడు ఆ కష్టానికి తగిన ఫలితం దక్కినట్లుగా అనిపిస్తుందని ఆయన భావోద్వేగంగా వెల్లడించారు. ఈ ఘటన గురించి కోన వెంకట్ స్పందిస్తూ.. నటీనటులు తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి సినిమాల కోసం పనిచేస్తారని తెలిపారు. సినిమానే ప్రాణంగా భావిస్తూ పనిచేసే తమకు, ప్రేక్షకులు సినిమాను ఆదరించి విజయవంతం చేస్తే అది మరో జన్మ లాంటి అనుభూతిని ఇస్తుందని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

2025 ఫిబ్రవరిలో మంగళూరు అడవిలో ‘కామ్రేడ్ కల్యాణ్’ కోసం ఈ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్న సమయంలోనే ఈ ఘటన జరిగిందని వెల్లడించారు. ప్రస్తుతం సినిమా సాధిస్తున్న విజయంతో శ్రీకాంత్‌తో పాటు మూవీ టీమ్ ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. సినిమా విడుదలైన తర్వాత తెరపై కనిపించే వినోదం మాత్రమే ప్రేక్షకులకు కనిపిస్తుంది. కానీ, ఆ సన్నివేశాల వెనుక నటీనటులు, సాంకేతిక బృందం పడే శ్రమ చాలామందికి తెలియదు. ‘కామ్రేడ్ కల్యాణ్’ షూటింగ్‌కు సంబంధించిన ఈ వీడియోతో సినిమా నిర్మాణంలో ఎదురయ్యే సవాళ్లు మరోసారి చర్చకు వచ్చాయి. ప్రస్తుతం కోన వెంకట్ షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us