Dil Raju: రౌడీ బాయ్స్ మొత్తంగా ఎంత వసూల్ చేసిందో చెప్పిన దిల్ రాజు.. చిన్న సినిమా భారీగానే కాసులు కురిపించిందిగా..

రీసెంట్ గా రిలీజ్ అయినా సినిమాల్లో మంచి టాక్ తో దూసుకుపోతున్న సినిమా రౌడీ బాయ్స్. ఈ సినిమాతో దిల్ రాజు సోదరుడు శిరీష్ కుమారుడు ఆశిష్ హీరోగా పరిచయం అయ్యాడు.

Dil Raju: రౌడీ బాయ్స్ మొత్తంగా ఎంత వసూల్ చేసిందో చెప్పిన దిల్ రాజు.. చిన్న సినిమా భారీగానే కాసులు కురిపించిందిగా..
Dil Raju
Follow us

|

Updated on: Jan 29, 2022 | 1:33 PM

Dil Raju: రీసెంట్ గా రిలీజ్ అయినా సినిమాల్లో మంచి టాక్ తో దూసుకుపోతున్న సినిమా రౌడీ బాయ్స్(Rowdy Boys). ఈ సినిమాతో దిల్ రాజు సోదరుడు శిరీష్ కుమారుడు ఆశిష్( Ashish) హీరోగా పరిచయం అయ్యాడు. ఈ సినిమాలో అందాల భామ అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది. శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై శ్రీహ‌ర్ష కొనుగంటి ద‌ర్శ‌క‌త్వంలో దిల్‌రాజు(Dil Raju) శిరీష్ ఈ సినిమా ను నిర్మించారు. ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన రౌడీ బాయ్స్ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అన్ని ఏరియాలనుంచి ఈ సినిమాకు మంచి స్పందన వస్తుంది. గతంలో దిల్ రాజు చెప్పినట్టు 15 నుంచి 25 ఏజ్ గ్రూప్ అబ్బాయిలు .. అమ్మాయిలు థియేటర్లో ఈ సినిమాను విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా మంచి రెస్పాన్స్ సొంతం చేసుకోవడంతో చిత్రయూనిట్ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. తాజాగా దిల్ రాజు ఈ సినిమా కలెక్షన్ ను తెలిపారు.

మొదటి వారం రౌడీ బాయ్స్ సినిమా 8.3 కోట్ల గ్రాస్ ను అందుకుంది అలాగే రెండో వారంలో 3.98 కోట్లు. ఈ రెండు వారాలకు కలిపి 12 కోట్ల గ్రాస్ ను వసూల్ చేసింది ఈ సినిమా. అలాగే మూడో వారం, నాలుగో వారం కలిపి మరో 3 కోట్ల గ్రాస్ వస్తుందని ఆశిస్తున్నామని దిల్ రాజు అన్నారు. మొత్తంగా ఓ కొత్త హీరో 15 కోట్ల గ్రాస్ యూ వసూల్ చేశాడు. అదికూడా మొదటి సినిమాతో అని దిల్ రాజు అన్నారు. అలాగే ఆశిష్ ను నేను హీరో అనను అతను ఆర్టిస్ట్ గా ప్రూవ్ చేసుకొని, లాంగ్ రన్ లో నిలబడితే అప్పుడు హీరో అవుతాడు. ఇక అందరూ ఆశిష్ యాక్టింగ్ ను మెచ్చుకుంటున్నారు.. మంచి  ఫ్యూచర్ ఉంది అని అంటున్నారు. ఆశిష్ లో విషయం ఉంది అతను యాక్టర్ గా మరింత ఎదగాలి అన్నారు. అలాగే హిస్టరీ ప్రకారం పెద్ద సినిమా వస్తే.. చిన్న సినిమాలు వాయిదా వేయాల్సిందే.. ఫిబ్రవరి నుండి సినిమాలన్నీ వరుసగా రిలీజ్ అవ్వబోతున్నాయి.. ఎవరి సినిమా వీలుని బట్టి వాళ్ళ రిలీజ్ డేట్ లు అనౌన్స్ చేసుకుంటారు…రోజులు సరిగ్గా లేకపోతే ఆర్ఆర్ఆర్ సినిమాలా రెండు మూడు రిలీజ్ డేట్ లు అనౌన్స్ చేసుకోవాల్సొస్తుంది. అందరు ప్రొడ్యూసర్ లు డిసైడ్ అయి ప్రతీ సినిమా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేస్తారు. పెద్ద సినిమాలు అన్నీ తప్పుకోవడంతో రౌడీ బాయ్స్ కు సంక్రాంతి స్లాట్ దొరికింది. లేకపోతే పగడ్బందీగా ప్లాన్ చేసుకుని రౌడీ బాయ్స్ ని ముందుగా ప్రేక్షకులకు రీచ్ చేసి ఆ తరువాత రిలీజ్ చేసే వాడిని అని చెప్పుకొచ్చారు దిల్ రాజు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Rajamouli: బ్లడ్ క్యాన్సర్‏తో పోరాడుతున్న ఆర్టిస్ట్.. ఆదుకోవాలంటూ డైరెక్టర్ రాజమౌళి విజ్ఞప్తి..

Best Buddies: నాటి చిన్న నాటి స్నేహితులు.. క్లాస్ మేట్స్.. నేడు సెలబ్రేటీలు.. ఇప్పటికీ ఫ్రెండ్స్ ఎవరో తెలుసా

Megastar Chiranjeevi: క్వారంటైన్‏లో ఉన్నాను అందుకే నీ ఆశీస్సులు తీసుకోలేకపోతున్నాను.. చిరంజీవి ఎమోషనల్ పోస్ట్..

చక్రవ్యూహంలో ప్రవేశించిన మేనల్లుడిని కన్నయ్య ఎందుకు రక్షించలేదంటే
చక్రవ్యూహంలో ప్రవేశించిన మేనల్లుడిని కన్నయ్య ఎందుకు రక్షించలేదంటే
పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్ కతా.. 25 కోట్ల ప్లేయర్ దూరం
పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్ కతా.. 25 కోట్ల ప్లేయర్ దూరం
రజినీకాంత్‌తో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు..
రజినీకాంత్‌తో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు..
తెలంగాణలో రాగల ఐదురోజులు వడగాలులు.. ఆ ప్రాంతాలకు IMD హెచ్చరిక
తెలంగాణలో రాగల ఐదురోజులు వడగాలులు.. ఆ ప్రాంతాలకు IMD హెచ్చరిక
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
విమానాలు రద్దయితే ఆటోమేటిక్‌ రిఫండ్‌
విమానాలు రద్దయితే ఆటోమేటిక్‌ రిఫండ్‌
వేసవి తాపాన్ని తట్టుకోవడానికి డ్రైవర్‌ వినూత్న ఆలోచన !!
వేసవి తాపాన్ని తట్టుకోవడానికి డ్రైవర్‌ వినూత్న ఆలోచన !!
టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్ల కింగ్‌.. యువరాజ్‌ కు కీలక బాధ్యతలు
టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్ల కింగ్‌.. యువరాజ్‌ కు కీలక బాధ్యతలు