కన్నడ నుంచి తెలుగులోకి వస్తున్న క్రేజీ మూవీ.. ప్రేమనే ఊరిలో సినిమా ఎప్పుడంటే

సెప్టెంబర్ 25న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లో గ్రాండ్ రిలీజ్ కానున్న చిత్రం ‘ప్రేమనే ఊరిలో’. ఈ సినిమా కన్నడ ఇండస్ట్రీ నుంచ్చి తెలుగులోకి వస్తుంది. ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్స్ ఆకట్టుకున్నాయి. చిన్న సినిమాలు ఇటీవల మంచి విజయాలను అందుకుంటున్నాయి. అలాగే ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంటుందేమో చూడాలి

కన్నడ నుంచి తెలుగులోకి వస్తున్న క్రేజీ మూవీ.. ప్రేమనే ఊరిలో సినిమా ఎప్పుడంటే
Premane Oorilo

Updated on: Sep 15, 2026 | 1:18 PM

చిన్నసినిమాలు ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపుతున్నాయి, కంటెంట్ ను నమ్ముకొని విడుదలవుతున్న సినిమాలు మంచి విజయాలను సాధిస్తున్నాయి. ఇప్పటికే చాలా చిన్న సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి. ఇప్పుడు ఓ ఆసక్తికర సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మహారత్న ప్రొడక్షన్స్, ఎస్‌కే పిక్చర్స్, వనిల్లా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌లపై చందు శ్రీనివాస్, సురేష్ కొండేటి, మమత దేవేంద్ర ఎం సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘ప్రేమనే ఊరిలో’. ఈ సినిమాకి మనోజ్ కుమార్ కథ, కథనం, దర్శకత్వం వహించారు. శ్రీరామ్, రమిక శివు, తపస్విని పూనాచ, రంగాయణ రఘు తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

అప్పుడు తెలుగులో క్రేజీ హీరోయిన్.. కట్ చేస్తే మాజీ సీఎం భార్య.. ఇద్దరి మధ్య 27ఏళ్ల ఏజ్ గ్యాప్

ఇప్పటికే ఈ మూవీ టీజర్‌ను రిలీజ్ చేయగా అందరిలోనూ ఇంట్రెస్ట్‌ను క్రియేట్ చేసింది. అలాగే తాజాగా ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ పొందాయి. సెప్టెంబర్ 25న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లో విడుదలకు సిద్ధమైంది. కేజీఎఫ్, కాంతారా వంటి చిత్రాలకు డైలాగ్స్ అందించిన హనుమాన్ చౌదరి ఈ చిత్రానికి సంభాషణలు రాశారు. ప్రముఖ గేయ రచయిత రాంబాబు గోసాల పాటలను రచించారు.

160కిపైగా సినిమాలు.. స్టార్ హీరోలతో జతకట్టిన అందాల తార.. ఆమె చెల్లి కూడా తిరుగులేని హీరోయిన్

సునద్ గౌతమ్ సంగీతం అందిస్తుండగా, రాజ్‌కాంత్ ఎస్.కె సినిమాటోగ్రఫీ, హర్షిత్ ప్రభు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కథ, ప్రేమ, భావోద్వేగాలు, బలమైన పాత్రలు, అందమైన పల్లె నేపథ్యంతో పాటు సురేష్ కొండేటి కంటెంట్ సెలక్షన్‌కు ఉన్న ప్రత్యేక గుర్తింపు తో ‘ప్రేమనే ఊరిలో’ మరో మంచి చిత్రంగా నిలుస్తుందనే అంచనాలు నెలకొన్నాయి. ఈ సెప్టెంబర్ 25న థియేట్రికల్ రిలీజ్ కు ఈ సినిమా సిద్ధమైంది.

ఇవి కూడా చదవండి

OTT Movie : ఓర్నీ.. ఇదెక్కడి సినిమారా అయ్యా..!! ఓటీటీని అల్లడిస్తున్న సైకలాజికల్ థ్రిల్లర్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us