
బాలీవుడ్ అందాల తార దీపికా పడుకొణె 2024లో దువా పదుకొణె అనే ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఇప్పుడు ఆమె మళ్లీ తల్లిగా ప్రమోషన్ పొందనుంది. ఇప్పుడామె గర్భంతో ఉంది. ఈ విషయం పట్ల దీపిక అభిమానులు హ్యాపీగా ఉన్నప్పటికీ అల్లు అర్జున్ అభిమానులు కాస్త ఆందోళన చెందుఉతన్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ నటిస్తోన్న ‘రాకా’ సినిమాలో దీపిక హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ చాలా భాగం పూర్తయ్యింది. అయితే ఇప్పుడు దీపిక గర్భం ధరించడంతో రాకా సినిమా షూటింగ్ ఆలస్యం అవుతుందేమోనని బన్నీ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అయితే అలాంటి టెన్షన్ అవసరం లేదంటోంది దీపిక. ‘రాకా’ .. సినీ ప్రేక్షకులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో ఇది కూడా ఒకటి. ఈ సినిమాకు అట్లీ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ పాన్ వరల్డ్ మూవీలో అల్లు అర్జున్ ఒక విభిన్నమైన గెటప్‌లో కనిపిస్తున్నారు. దీంతో ఈ సినిమాపై అభిమానులు చాలా అంచనాలు పెట్టుకున్నారు. ఇప్పటికే ‘రాకా’ షూటింగ్ పూర్తయ్యింది. ఈ నెల మొదట్లో అర్జున్ పుట్టినరోజున ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు.మరోవైపు దీపిక లుక్ ఎలా ఉంటుందోనన్న ఆసక్తి కూడా అభిమానుల్లో ఉంది. అయితే గర్భంతో ఉన్నప్పటికీ ‘రాకా’ సినిమా కోసం యాక్షన్ సీన్స్ చేయడానికి దీపికా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట.
నిపుణులైన వైద్య బృందం పర్యవేక్షణలో, అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ రాకా మూవీ షూటింగ్ పూర్తి చేయాలని దీపిక నిర్ణయం తీసుకుందట. ఈ విషయం దర్శకుడు అట్లీకి కూడా చెప్పడంతో.. వీలైనంత తొందరగా దీపికకు సంబంధించిన సన్నివేశాల షూటింగ్‌ని పూర్తి చేయాలని ఆయన భావిస్తున్నాడట. ఇక దీపిక కోసం రాకా చిత్ర బృందం అన్ని జాగ్రత్తలూ తీసుకుంది. సెట్‌లో ఒక వైద్యుడిని కూడా ఉంచారట. ఆయనను సంప్రదించిన తర్వాతే దీపిక షూటింగ్ కు వస్తుందట. మరి కొన్ని నెలల పాటు రాకా సినిమా షూటింగ్‌తో బిజీగా ఉండనుంది దీపిక.
ఇక దీపికా ఒప్పుకున్న మరో క్రేజీ ప్రాజెక్ట్ ‘కింగ్’. షారుఖ్ ఖాన్ హీరోగా నటిస్తున్న ఈ మూవీ ఇంకా షూటింగ్ దశలో ఉంది. ఇందులో కూడా దీపిక పదుకొణె పాత్రకు యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయట. వాటిని కూడా ఆమె పూర్తి చేయాలనుకుంటోందని సమాచారం. తనవల్ల షూటింగ్‌కి అంతరాయం కావొద్దనే దీపికా ఈ కీలక నిర్ణయం తీసుకుందని సమాచారం.
Pregnant #DeepikaPadukone films ‘intense action sequence’ for #AlluArjun ‘s #Raaka , will continue shoot throughout pregnancy ✅
Deepika has recently started filming #Atlee ’s upcoming pan-India actioner Raaka, which stars Allu Arjun in the lead. The film’s title and first look… pic.twitter.com/Rxy29qUD2j
— Always Bollywood (@AlwaysBollywood) April 19, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.