Prabhas: డార్లింగ్ ఈజ్ బ్యాక్.. ఎంత క్యూట్‏గా ఉన్నాడో.. ప్రభాస్ న్యూలుక్ చూశారా ..?

అటు సినిమా చిత్రీకరణలతో బిజీగా ఉంటూనే వీలు దొరికినప్పుడల్లా.. ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. బాహుబలి తర్వాత ప్రభాస్ ఫిట్నెస్ పై అంతగా దృష్టి పెట్టలేదని.. అలాగే సినిమాలు, పాత్రల కోసం తన బరువు పెరగడం, తగ్గడం... జుట్టు పెంచడం చేయడంతో ప్రభాస్ లుక్స్ పూర్తిగా మారిపోయింది. అలాగే కొన్నిరోజులుగా ప్రభాస్ అంతగా బయట కనిపించలేదు. తాజాగా ఇప్పుడు ప్రభాస్ న్యూలుక్ నెట్టింట వైరలవుతుంది.

Prabhas: డార్లింగ్ ఈజ్ బ్యాక్.. ఎంత క్యూట్‏గా ఉన్నాడో.. ప్రభాస్ న్యూలుక్ చూశారా ..?
Prabhas
Follow us

|

Updated on: Apr 18, 2024 | 2:54 PM

పాన్ ఇండియాలో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో ప్రభాస్. బాహుబలి సినిమాతో డార్లింగ్ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఈ మూవీతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ సినిమా తర్వాత ప్రభాస్ నటించిన సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాలు నిరాశపరిచినా.. ఇటీవల రిలీజ్ అయిన సలార్ మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. అయితే బాహుబలి తర్వాత ప్రభాస్ లుక్స్ లో చాలా మార్పులు వచ్చాయి. బరువు పెరగడమే కాకుండా అనారోగ్య సమస్యలు, మోకాలి నొప్పులతో చాలా ఇబ్బందులు పడ్డారు. అటు సినిమా చిత్రీకరణలతో బిజీగా ఉంటూనే వీలు దొరికినప్పుడల్లా.. ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. బాహుబలి తర్వాత ప్రభాస్ ఫిట్నెస్ పై అంతగా దృష్టి పెట్టలేదని.. అలాగే సినిమాలు, పాత్రల కోసం తన బరువు పెరగడం, తగ్గడం… జుట్టు పెంచడం చేయడంతో ప్రభాస్ లుక్స్ పూర్తిగా మారిపోయింది. అలాగే కొన్నిరోజులుగా ప్రభాస్ అంతగా బయట కనిపించలేదు. తాజాగా ఇప్పుడు ప్రభాస్ న్యూలుక్ నెట్టింట వైరలవుతుంది.

ప్రస్తుతం ప్రభాస్ కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుంది. అందులో ప్రభాస్ బరువు తగ్గి హ్యాండ్సమ్ లుక్ లో కనిపిస్తున్నారు. ఈ వీడియో చూసిన ఫ్యాన్స్.. వింటేజ్ డార్లింగ్ ఈజ్ బ్యాక్.. డార్లింగ్ ఎంత క్యూట్ గా ఉన్నావ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అలాగే ప్రభాస్ ఫ్యాన్స్ ఆ వీడియోను తెగ షేర్ చేస్తున్నారు. ప్రస్తుతం కల్కి సినిమాలో నటిస్తున్నారు ప్రభాస్. అలాగే డైరెక్టర్ మారుతి దర్శకత్వం వహిస్తున్న రాజాసాబ్ మూవీలో నటిస్తున్నారు. హారర్ కామెడీ డ్రామాగా రాబోతున్న ఈ మూవీలో ప్రభాస్ వింటేజ్ డార్లింగ్ లా కనిపించనున్నాడని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుండగా.. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

త్వరలోనే ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ కానుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన టైటిల్ పోస్టర్ ఆకట్టుకుంది. ఇందులో ప్రభాస్ లుక్ ఆకట్టుకుంది. ఈ సినిమా తర్వాత యానిమల్ మూవీ ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ మూవీ చేయనున్నారు. అలాగే డైరెక్టర్ హను రాఘవపూడి డైరెక్షన్లో ఓ ప్రేమకథ చేయనున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.