Prabhas – Nag Ashwin Movie: త్వరలోనే ప్రాజెక్ట్ కే సెకండ్ షెడ్యూల్.. కీలక సన్నివేశాలన్నీ ఇందులోనేనట..

|

Aug 09, 2021 | 1:54 PM

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న సినిమా పై ఆంతా ఎంతో ఆసక్తిగా ఉన్నారు. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమా ఎలా ఉండబోతుందని

Prabhas - Nag Ashwin Movie: త్వరలోనే ప్రాజెక్ట్ కే సెకండ్ షెడ్యూల్.. కీలక సన్నివేశాలన్నీ ఇందులోనేనట..
Follow us on

Prabhas – Nag Ashwin Movie: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నాగ్ అశ్విన్ కాంబినేషన్‌‌‌‌‌లో తెరకెక్కుతోన్న సినిమా పై ఆంతా ఎంతో ఆసక్తిగా ఉన్నారు. భారీ బడ్జెట్‌‌‌‌తో రూపొందుతున్న ఈ సినిమా ఎలా ఉండబోతుందని అంతా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ కథతో తెరకెక్కుతోందని కొందరు అంటుంటే.. మరి కొందరు యాక్షన్ బ్యాక్ డ్రాప్ మూవీ అని అంటున్నారు. ఇంతవరకు ఈ విషయం పై క్లారిటీ అయితే రాలేదు. కానీ ఈ సినిమాకు సంబంధించి ఎదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టారు చిత్రయూనిట్. ఈ షెడ్యూల్‌‌‌లో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ పై కొన్ని సన్నివేశాల చిత్రీకరిస్తున్నారు. ప్రాజెక్ట్ కే అనే వర్కింగ్ టైటిల్‌‌‌తో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమా మొదటి షెడ్యూల్‌‌లో ప్రభాస్ పైన సన్నివేశాలు చిత్రీకరించలేదు.

ప్రస్తుతం ప్రభాస్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సలార్ మూవీ షూటింగ్ లో ఉన్నాడు. అయితే త్వరలోనే ప్రాజెక్ట్ కే సెకండ్ షెడ్యూల్ మొదలుకానుంది తెలుస్తోంది. అక్టోబర్ నుండి ప్రాజెక్ట్ కే షూటింగ్ లో ప్రభాస్ తో పాటు అమితాబచ్చన్ కూడా పాల్గొనబోతున్నట్లుగా సమాచారం. అయితే తాజా సమాచారం సమాచారం ప్రకారం అక్టోబర్ నెల మొత్తం కూడా ప్రభాస్.. అమితాబచ్చన్ మరియు దీపికల కాంబోలో సన్నివేశాలు ఉంటాయట. ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియాగా విడుదల కాబోతుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

MAA Elections 2021: ముదురుతున్న మా లొల్లి .. హేమపై సీరియస్ అయిన సీనియర్ నరేష్. చర్యలు తప్పవంటూ..

KTR : నాకు తెలిసిన నైసెస్ట్ పర్సన్ మీరే డియర్ బ్రదర్.. మహేష్ బాబుకు బర్త్ డే విషెస్ తెలిపిన కేటీఆర్..

Happy Birthday Hansika: పరువాల పాలరాతిశిల్పం పుట్టినరోజు నేడు.. హ్యాపీ బర్త్ డే టూ హన్సిక..