Poonam Kaur: ఆ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ వస్తే చేయలేదు.. షాకింగ్ కామెంట్స్ చేసిన హీరోయిన్ పూనమ్ కౌర్..

హీరోయిన్ పూనమ్ కౌర్ (Poonam Kaur) సోషల్ మీడియాలో చేసే రచ్చ గురించి తెలిసిందే. ఎప్పటికప్పుడు ఏదో ఒక విషయంపై ట్వీట్ చేయడం.

Poonam Kaur: ఆ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ వస్తే చేయలేదు.. షాకింగ్ కామెంట్స్ చేసిన హీరోయిన్ పూనమ్ కౌర్..
Poonam Kaur

Updated on: Mar 13, 2022 | 6:20 PM

హీరోయిన్ పూనమ్ కౌర్ (Poonam Kaur) సోషల్ మీడియాలో చేసే రచ్చ గురించి తెలిసిందే. ఎప్పటికప్పుడు ఏదో ఒక విషయంపై ట్వీట్ చేయడం.. వెంటనే డెలీట్ చేయడం పూనమ్‏కు అలవాటు.. ఇక ఆమె చేసే ట్వీట్స్ క్షణాల్లో వైరల్ అవుతుంటాయి. సినిమాల కంటే ఎక్కువగా వివాదాలతోనే ఫేమస్ అయ్యింది ఈ ముద్దుగుమ్మ. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న పూనమ్ మరోసారి ప్రేక్షకులను అలరించనుంది. పూనమ్ కౌర్ ప్రధాన పాత్రలో నటించిన నాతి చరామి సినిమా త్వరలో విడుదల కానుంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్‏లో వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటుంది పూనమ్ కౌర్. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్‏కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హీరో విజయ్ దేవరకొండ గురించి.. తన కెరీర్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది.

పూనమ్ కౌర్ మాట్లాడుతూ.. చిన్నప్పటి నుంచి సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. కానీ ఇంట్లోవాళ్లకు ఇష్టం లేకపోవడంతో చేయలేదు. కెరీర్ ఆరంభంలో విజయ్ దేవరకొండ సినిమాలోనూ ఛాన్స్ వచ్చింది. కానీ ఒప్పుకోలేదు. ఎందుకంటే సినిమాల్లోకి రావాలని.. నటననే కెరీర్ గా మార్చుకోవాలని అనుకోలేదు. అనుహ్యంగా సినిమాల్లోకి వచ్చాను. కొన్ని సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నాను.. అయితే సినిమాలకు దూరంగా ఉండాలనుకున్న సమయంలో మా ఫ్రెండ్స్ వచ్చి నాతి చరామి గురించి చెప్పారు. నేను ఒప్పుకోలేదు. దీంతో వాళ్లు ముందు కథ వినమని చెప్పారు. ఆ తర్వాత నాకు స్టోరీ నచ్చి ఓకే అనేశాను.. అంటూ చెప్పుకొచ్చింది.

Also Read: Bandla Ganesh: దేవర జెండాకి కర్రనౌతా.. సోషల్ మీడియాలో బండ్ల గణేష్ రచ్చ..

Poonam Kaur: ప్రభాస్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసిన హీరోయిన్.. మరే హీరోకు ఇలాంటి క్యారెక్టర్ లేదంటూ..

RRR Movie: ఆర్ఆర్ఆర్ హంగామా షూరు.. ఆకాశంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ చేసిన పనికి ఫిదా కావాల్సిందే..

Migraine: మైగ్రేన్ సమస్య ఉన్నవారు ఈ పదార్థాలను అస్సలు తినకూడదు.. మర్చిపోతే మరింత ఎఫెక్ట్..

Loading...
Unable to load recommendations.
Follow Us