Pooja Hegde: క‌రోనా వేళ అవ‌స‌ర‌మైన టిప్స్ చెబుతోన్న బుట్ట‌బొమ్మ‌.. ఈ ప‌రిస్థితుల్లో ఇది ఎంతో మేలు చేస్తుందంటా..

|

Apr 30, 2021 | 3:45 PM

Pooja Hegde: వారు, వీరు అనే తేడా లేకుండా ఎవ‌రినీ వ‌దిలి పెట్ట‌డం లేదు క‌రోనా మ‌హ‌మ్మారి. సామాన్యుల నుంచి సెల‌బ్రిటీల వ‌ర‌కు అంద‌రిని చుట్టు ముట్టేస్తోంది. ఎప్పుడూ సెక్యురిటీతో ఉండే రాజ‌కీయ నాయ‌కుల‌ను, సినీ తార‌ల‌ను...

Pooja Hegde: క‌రోనా వేళ అవ‌స‌ర‌మైన టిప్స్ చెబుతోన్న బుట్ట‌బొమ్మ‌.. ఈ ప‌రిస్థితుల్లో ఇది ఎంతో మేలు చేస్తుందంటా..
Pooja
Follow us on

Pooja Hegde: వారు, వీరు అనే తేడా లేకుండా ఎవ‌రినీ వ‌దిలి పెట్ట‌డం లేదు క‌రోనా మ‌హ‌మ్మారి. సామాన్యుల నుంచి సెల‌బ్రిటీల వ‌ర‌కు అంద‌రిని చుట్టు ముట్టేస్తోంది. ఎప్పుడూ సెక్యురిటీతో ఉండే రాజ‌కీయ నాయ‌కుల‌ను, సినీ తార‌ల‌ను కూడా ఈ మ‌హ‌మ్మారి వ‌దిలి పెట్ట‌డం లేదు. ఈ క్ర‌మంలోనే తాజాగా అందాల తార పూజా హెగ్దే కూడా క‌రోనా బారిన ప‌డిన విష‌యం తెలిసిందే. ఇటీవ‌ల క‌రోనా పాజిటివ్ అని తెలియ‌గానే హోమ్ ఐసోలేష‌న్‌లోకి వెళ్లిన పూజా ప్ర‌స్తుతం చికిత్స తీసుకుంటుంది.
ఇక క‌రోనా బారిన ప‌డిన వారు ముఖ్యంగా ఎదుర్కొంటున్న స‌మ‌స్య శ్వాస స‌రిగ్గా తీసుకోలేక‌పోవ‌డం. ఊపిరితిత్తుల్లో వైర‌స్ చేర‌డంతో అది శ్వాస వ్య‌వ‌స్థ‌పై ప్ర‌భావం ప‌డుతుంది. దీంతో శ‌రీరంలో ఆక్సిజ‌న్ స్థాయి త‌గ్గిపోయి బాధితులు అనారోగ్యానికి గుర‌వుతున్నారు. ఈ నేప‌థ్యంలో ప్రాణాయామం చేయ‌డం వ‌ల్ల ఈ స‌మ‌స్య‌కు చెక్ పెట్ట‌వ‌చ్చ‌ని చెబుతోంది పూజా. హోమ్ ఐసోలేష‌న్‌లో ఉన్న పూజా… వ‌ర్చువ‌ల్‌గా ప్రాణాయామం నేర్చుకుంటోంది. ఈ విష‌యాన్ని అభిమానుల‌తో పంచుకున్న పూజా.. ప్రాణాయామంకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేస్తూ.. క‌రోనా ప్ర‌భ‌లుతోన్న ఇలాంటి ప‌రిస్థితుల్లో ప్రాణాయామాన్ని ప్రాక్టీస్ చేయాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది. ఇది మ‌నల్ని శాంత ప‌ర‌చ‌డంతో పాటు, శ్వాస స‌రిగ్గా తీసుకోవ‌డంలో ఉప‌యోగ‌ప‌డుతుంది అంటూ చెప్పుకొచ్చిందీ బ్యూటీ. మ‌రి పూజా చెప్పిన ఈ టెక్నిక్‌ను మీరు కూడా పాటించి.. మీ శ్వాస క్రియ ను మెరుగుప‌రుచుకోండి.

పూజా హెగ్దే ప్రాణాయామం చేస్తున్న వీడియో..

 

ఇదిలా ఉంటే పూజా హెగ్డే కెరీర్ విష‌యానికొస్తే.. ఈ చిన్న‌ది ప్ర‌స్తుతం అక్కినేని అఖిల్ హీరోగా తెర‌కెక్కుతోన్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్‌, ప్ర‌భాస్ హీరోగా వ‌స్తున్న రాధే శ్యామ్‌, ఆచార్య సినిమాలో చెర్రీ స‌ర‌స‌న న‌టిస్తూ బిజీగా గ‌డుపుతోంది. వీటితోపాటు హిందీ, తమిళంలో ఓ సినిమాలో న‌టిస్తోంది.

Also Read: కళ్లు మసక మసకగా కనిపిస్తున్నాయా..? చూపు మందగించిందా..! అయితే కచ్చితంగా ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే..?

DGCA: అంత‌ర్జాతీయ విమానాల‌పై నిషేధం పొడిగింపు.. ఉత్తర్వులు జారీ చేసిన డీజీసీఏ

Corona: ఎవరిని వదలని కరోనా మహమ్మారి.. వైరస్ బారిన పడి బీహార్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మృతి