పైన ఫోటోలో ఎంతో ప్రశాంతంగా నవ్వులు చిందిస్తున్న పాప ఇప్పుడు టాప్ హీరోయిన్. తెలుగులోనే కాదు.. తమిళ్, హిందీ భాషలలో కూడా వరుస ఆఫర్లతో బిజీగా బిజీగా గడిపేస్తుంది. గుర్తుపట్టగలరా.. మొదటి సినిమాతోనే లక్కీ గర్ల్ అనిపించుకున్న ఈ చిన్నది.. దాదాపు స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్గా అతి తక్కువ సమయంలోనే ఎదిగింది.
రామ్ చరణ్, ఎన్టీఆర్, ప్రభాస్, మహేష్ బాబు దాదాపు అందరితో స్ర్కీన్ షేర్ చేసుకున్నా ఈ చిన్నారికి తెలుగులో యమ క్రేజ్. గుర్తుపట్టండి.
ఇటీవల స్టార్ హీరోహీరోయిన్లకు సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో తెగ హంగామా సృష్టిస్తున్నాయి. కదా.. కానీ ఈ చిన్నారి ఫోటో మాత్రం ప్రస్తుతం ఇంటర్నెట్ను షెక్ చేస్తోంది. ఇందులో ఉన్న హీరోయిన్ను గుర్తుపట్టడం కష్టమే. కానీ చిన్న క్లూ.. మీకోసం. ప్రస్తుతం ఈ అమ్మడు నటించిన సినిమా కోసం యావత్ ఇండియా ఎదురుచూస్తుంది.
పైన ఫోటోలలో ఉన్న చిన్నారి మరెవరో కాదండోయ్.. అందాల బుట్ట బొమ్మ పూజా హెగ్డే. ఒక లైలా కోసం అంటూ తెలుగు తెరకు పరిచమయైన ఈ పూజా హెగ్డే.. ఆ తర్వాత వరుస ఆఫర్లతో టాలీవుడ్‌ను ఏలేస్తుంది. ప్రస్తుతం ఈ అమ్మడు చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంది. అలాగే ప్రభాస్ సరసన రాధేశ్యామ్ సినిమాలో నటిస్తోంది. ఈ మూవీ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అలాగే అక్కినేని అఖిల్ సరసన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీలో నటించింది. తాజాగా.. మహేష్.. త్రివిక్రమ్ కాంబోలో రాబోతున్న సినిమాలో నటించనుంది.
Also Read: నాగార్జున- ప్రవీణ్ సత్తారు సినిమాలో మరో హీరోయిన్… టాలీవుడ్‌కు ఎంట్రీ ఇవ్వనున్న బాలీవుడ్ బ్యూటీ..