Peddi Movie: పెద్ది బడ్జెట్ ఎంతో తెలుసా.. ? రామ్ చరణ్ పారితోషికం అంతే.. ఎవరికి ఎక్కువంటే..

మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా సినిమా పెద్ది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాపై ముందు నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి. జూన్ 4న విడుదలైన ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తుంది. అంతేకాదు.. విడుదలైన గంటలోనే దాదాపు 40వేలకు పైగా టికెట్స్ బుక్కయ్యాయంటే పెద్ది క్రేజ్ ఏ స్థాయిలో ఉందో చెప్పక్కర్లేదు.

Peddi Movie: పెద్ది బడ్జెట్ ఎంతో తెలుసా.. ? రామ్ చరణ్ పారితోషికం అంతే.. ఎవరికి ఎక్కువంటే..
Peddi Movie Cast

Updated on: Jun 04, 2026 | 3:17 PM

భారీ అంచనాల మధ్య జూన్ 4న విడుదలైన సినిమా పెద్ది. డైరెక్టర్ బుచ్చిబాబు సన దర్శకత్వంలో తెరకెక్కిన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించారు. ఈ చిత్రానికి ఉదయం నుంచి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వస్తుంది. ఈ క్రమంలోనే ఈ సినిమా బడ్జెట్, నటీనటుల రెమ్యూనరేషన్స్ (పారితోషికాలు) గురించిన చర్చలు ఊపందుకున్నాయి. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మించిన ‘పెద్ది’ చిత్రంలో జాన్వీ కపూర్, శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ, బోమన్ ఇరానీ తదితరులు నటించారు. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించగా, రత్నవేలు సినిమాటోగ్రఫీని, నవీన్ నూలి ఎడిటింగ్‌ను నిర్వహించారు.

ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతున్న సమాచారం ప్రకారం, ఈ సినిమా బడ్జెట్‌లో చాలా పెద్ద భాగం నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికాలకే ఖర్చయినట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసం రామ్ చరణ్ ఏకంగా రూ.100 కోట్ల రేంజ్‌లో పారితోషికం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ‘ఉప్పెన’ తర్వాత ఆయన చేస్తున్న రెండో సినిమా కావడంతో, బుచ్చిబాబుకు దాదాపు రూ.30 కోట్లు అందినట్లు టాక్. హీరోయిన్ జాన్వీ కపూర్, మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్, సినిమాటోగ్రాఫర్ రత్నవేలుతో పాటు మిగతా కీలక నటీనటుల అందరి రెమ్యూనరేషన్లు కలిపి దాదాపు రూ.35 నుండి రూ.40 కోట్ల వరకు ఖర్చయినట్లు సమాచారం. అయితే, ఈ రెమ్యూనరేషన్ల వివరాలపై చిత్ర బృందం (నిర్మాతలు) ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, ఈ సినిమా మొత్తం బడ్జెట్ దాదాపు రూ.250 కోట్ల నుండి రూ. 300 కోట్ల వరకు ఉంటుందని అంచనా.

‘ఉప్పెన’ సినిమాతో మొదటి ప్రయత్నంలోనే క్లాసిక్ హిట్‌ కొట్టి, జాతీయ అవార్డు అందుకున్న దర్శకుడు బుచ్చిబాబు సన. ఆయన రాసుకునే కథల్లో ఎమోషన్ చాలా బలంగా ఉంటుంది. ‘పెద్ది’ కేవలం ఒక స్పోర్ట్స్ యాక్షన్ సినిమా మాత్రమే కాదు, గుండెలను పిండేసే బలమైన పల్లెటూరి భావోద్వేగాలు, సెంటిమెంట్ కలగలిసిన కథ. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌కు బుచ్చిబాబు మార్క్ ఎమోషన్ తోడైతే స్క్రీన్ మీద మ్యాజిక్ రిపీట్ అవ్వడం ఖాయం. ఈ సినిమాలో రామ్ చరణ్‌కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటించింది. వీరిద్దరి స్క్రీన్ ప్రెజెన్స్ , కెమిస్ట్రీ సినిమాకు కొత్త కలర్ తీసుకొచ్చింది. వీరితో పాటు కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, విలక్షణ నటుడు జగపతి బాబు, బాలీవుడ్ నటులు బోమన్ ఇరానీ, దివ్యేందు శర్మ వంటి భారీ తారాగణం ఉండటం వల్ల ప్రతి పాత్ర ఎంతో పవర్‌ఫుల్‌గా ఉండబోతోంది.

ఎక్కువమంది చదివినవి : Maheswari: ఆ హీరో అంటే క్రష్.. పిచ్చిగా ప్రేమించా.. చెల్లి అని మనసు ముక్కలు చేశాడు.. హీరోయిన్ మహేశ్వరి..

ఎక్కువమంది చదివినవి : ఏం సినిమా రా బాబూ.. ఒక్కో సీన్ ఊపిరి బిగపట్టి చూడాల్సిందే.. ఓటీటీలో రచ్చ చేస్తున్న మలయాళీ

Follow Us