VakeelSaab New Song : వకీల్ సాబ్ నుంచి కంటిపాప కంటి పాప సాంగ్ రిలీజ్ .. ఆకట్టుకుంటున్న థమన్ సంగీతం

హిట్ ప్లాప్ లతో సంబంధంలేని క్రేజ్ ను సొంతం చేసుకున్న హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. గత ఎన్నికల ముందు అజ్ఞాతవాసిలో నటించిన పవన్ చాలా గ్యాప్ తీసుకుని నటిస్తున్న సినిమా వకీల్ సాబ్....

VakeelSaab New Song : వకీల్ సాబ్ నుంచి కంటిపాప కంటి పాప సాంగ్ రిలీజ్ .. ఆకట్టుకుంటున్న థమన్ సంగీతం
Vakil Saab

Updated on: Mar 17, 2021 | 6:53 PM

VakeelSaab New Song  : హిట్ ప్లాప్ లతో సంబంధంలేని క్రేజ్ ను సొంతం చేసుకున్న హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. గత ఎన్నికల ముందు అజ్ఞాతవాసిలో నటించిన పవన్ చాలా గ్యాప్ తీసుకుని నటిస్తున్న సినిమా వకీల్ సాబ్. బాలీవుడ్ సూపర్ మూవీ పింక్ కి రీమేక్ గా తెరకెక్కుతున్న సినిమా టీజర్ సంక్రాంతి కానుకగా రిలీజై ఇప్పటికే సినిమాపై అంచనాలు పెంచేసింది.. తాజాగా కంటిపాప కంటి పాప సాంగ్ ను చిత్ర యూనిట్ తాజాగా రిలీజ్ చేసింది. కంటిపాప కంటిపాప చెప్పనైనా లేదే.. నువ్వులా అలా ఎన్ని కలలు కన్నా .. కాలి మువ్వ కాలిమువ్వా సవ్వడైనా లేదే.. నువ్వు ఎన్ని నాళ్లుగా వెంట తిరుగున్నా.. నీరాక ఏరువాక.. నీచూపే ప్రేమ నీలో నువ్వు ఆగిపోక కలిసావే కాంతి రేఖ అంతులేని ప్రేమ నువ్వే .. లిరిక్స్ సాగిన సాంగ్ సంగీతాభిమానులను ఆకట్టుకుంటుంది. థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలోని మగువ సాంగ్ ఇప్పటికే సూపర్ హిట్ అయ్యింది.

పవన్ కళ్యాణ్ తొలిసారిగా లాయర్ పాత్రలో నటిస్తున్నాడు. నిజానికి ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉంది. అయితే కరోనా నేపథ్యంలో షూటింగ్ ఆలస్యం కావడంతో రిలీజ్ కూడా ఆలస్యమైంది. దీంతో వేసవి వినోదంగా వకీల్ సాబ్ రానుంది. ఓ వైపు థియేట్రికల్ రైట్స్ భారీ రేంజ్ లో బిజినెస్ జరుగుతుండగా.. ఇటీవలే శాటిలైట్ రైట్స్ , డిజిటల్ రైట్స్ కూడా భారీ స్థాయిలో అమ్మడుపోయినట్లు తెలుస్తోంది.

పవన్ కళ్యాణ్ హీరోగా వేణు శ్రీరాం దర్శకత్వంలో దిల్ రాజు, బోని కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. నివేదా థామస్, అంజలి కీలక పాత్రలో కనిపించనున్నారు.

 

 

Also Read:  సినిమా బ్లాక్ బస్టర్, పవన్ ఈజ్ బ్యాక్… ఫస్ట్ రివ్యూ చెప్పేసిన ఆ క్రిటిక్

ఎఫ్ – 3లో వెంకటేశ్ రేచీకటితో అలరించనున్నాడా..? డైరెక్టర్ అనిల్ రావిపూడి ఏం చెబుతున్నాడో తెలుసా..

Loading...
Unable to load recommendations.
Follow Us