Akira Nandan: తండ్రిని మించిన తనయుడు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పవన్ – అకీరా ఫోటో..

పవన్ కల్యాణ్ కుమారుడు అకీరా నందన్ గురించి తెలుసుకునేందుకు అభిమానులు ఎప్పుడూ ఆసక్తిని కనబరుస్తారు. వారి ఉత్సాహాన్ని రెట్టింపు చేసేందుకు రేణు దేశాయ్

Akira Nandan: తండ్రిని మించిన తనయుడు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పవన్ - అకీరా ఫోటో..
Akira

Updated on: Jun 01, 2021 | 8:02 AM

Akira Nandan:

పవన్ కల్యాణ్ కుమారుడు అకీరా నందన్ గురించి తెలుసుకునేందుకు అభిమానులు ఎప్పుడూ ఆసక్తిని కనబరుస్తారు. వారి ఉత్సాహాన్ని రెట్టింపు చేసేందుకు రేణు దేశాయ్ కూడా అప్పుడప్పుడు సోషల్ మీడియాలో అకీరా ఫొటోలను షేర్ చేసుకుంటూ ఉంటుంది. మెగా ఫ్యామిలీ లో జరిగే కార్యక్రమాలకు అకీరా పాల్గొంటూ ఉంటాడు. ఆసమయంలో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంటాయి. ఆ ఫోటోలను చూసిన అభిమానులు ఫుల్ ఖుష్ అవుతూ ఉంటారు. అయితే మెగాఫ్యామిలీ లో అందరికంటే అకీరా ఎత్తుగా ఉంటాడు. ఇక పవన్ – అకీరా ఒక ఫ్రేమ్ లో కనిపించారంటే ఫ్యాన్స్ కి పండగే. ఈ క్రమంలో తాజాగా పవన్ ఆయన కొడుకు కలిసి దిగిన ;ఫోటో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.

అకీరా నందన్ తన తండ్రి పవన్ పక్కన నిల్చోని ఉన్న ఈ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఎత్తులో తండ్రిని మించి పోయిన అకీరా  ఈ ఫొటోలో చాలా హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నాడు. అకీరాను పవన్ మ్యూజిక్ క్లాస్ కు తీసుకెళ్లిన సందర్భంగా తీసుకున్నదని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మెగా వారసుడి ఎంట్రీ ఎప్పుడని అడుగుతున్నారు. నిజానికి అకిరా నందన్ ఆల్రెడీ మరాఠీలో ఓ సినిమా చేశాడు. తన తల్లి రేణు దేశాయ్ తెరకెక్కించిన ‘ఇష్క్ వాలా లవ్’ సినిమాలో నటించాడు. ఈ క్రమంలో టాలీవుడ్ లో కూడా లాంచ్ చేస్తారేమో చూడాలి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

అర్ధరాత్రి నా కారును నలుగురు దుండగులు వెంబడించారు.. అది చాలా భయంకరమైన రోజు.. చేదు అనుభవాన్ని చెప్పిన నటి..

Prabhas: యంగ్ రెబల్ స్టార్ కోసం మరో బాలీవుడ్ డైరెక్టర్.. పాన్ ఇండియా ప్రాజెక్ట్‏లో ప్రభాస్ పాత్ర అదేనా..

 

Loading...
Unable to load recommendations.
Follow Us