AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kiraak RP: కిర్రాక్ ఆర్పీ చేపల దుకాణాలు మూత పడటానికి అసలు కారణాలు ఇవే..

ప్రముఖ ప్రొడక్షన్ మేనేజర్ పచ్చళ్ల ప్రకాష్ కిరాక్ RP చేపల పులుసు వ్యాపార వైఫల్యానికి గల కారణాలను వివరించారు. నాణ్యతను కాపాడుకోకపోవడం వల్లే బ్రాంచ్‌లు మూతపడ్డాయని తెలిపారు. అంతేకాకుండా, తాను ఒక ప్రముఖ హీరోయిన్‌ను చిత్ర పరిశ్రమకు పరిచయం చేసిన నేపథ్యం, తన కుమారుడి సినీరంగ ప్రవేశం, పవన్ కళ్యాణ్ కుటుంబంతో తన అనుబంధం గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

Kiraak RP: కిర్రాక్ ఆర్పీ చేపల దుకాణాలు మూత పడటానికి అసలు కారణాలు ఇవే..
Kiraak RP Nellore Chepala Pulusu
Ram Naramaneni
|

Updated on: Jul 08, 2026 | 1:21 PM

Share

సినీ రంగంలో ప్రొడక్షన్ మేనేజర్‌గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న పచ్చళ్ల ప్రకాష్ ఓ ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా, జబర్దస్త్ ఫేమ్ కిరాక్ RP ప్రారంభించిన “నెల్లూరు పెద్దా రెడ్డి చేపల పులుసు” వ్యాపారం ఎందుకు విఫలమైందో ప్రకాష్ స్పష్టం చేశారు. కిరాక్ RPకి ఫుడ్ బిజినెస్‌లో సహాయం చేయడానికి ప్రకాష్ ముందుకు వచ్చారు. నాలుగు ఐటమ్స్‌తో వ్యాపారం ప్రారంభించాలని RP అనుకున్నప్పుడు, ప్రకాష్ అది సాధ్యం కాదని, క్వాలిటీ, టేస్ట్ మెయింటైన్ చేస్తూ కర్రీ పాయింట్ పెట్టమని సలహా ఇచ్చారు. ప్రకాష్ సహాయంతో కిచెన్ ఓపెనింగ్ చేసి, నాలుగు బ్రాంచ్‌లు కూడా ప్రారంభించారు. ఆపై తనకున్న పరిచయాలు, ఫేమ్‌తో వ్యాపారాన్ని బ్రాంచులుగా విస్తరించారు. డబ్బు కట్టిన వారికి బ్రాంచులు ఇచ్చాడు. అయితే క్వాలిటీతో పాటు ధర విషయంలో నెట్టింట చాలామంది కామెంట్స్ పెడుతూ వచ్చారు. దీంతో తర్వాతికాంలో.. వ్యాపారం సరిగా నడవకపోవడంతో RP వాటిని నిలబెట్టుకోలేకపోయారు. చేపల పులుసులో ఉప్పు, కారం, పులుపు వంటివి సరిగా లేవని కస్టమర్లు ఫిర్యాదులు చేసినా, RP వాటిని సరిదిద్దుకోవడంలో విఫలమయ్యారని ప్రకాష్ తెలిపారు. నాణ్యత, నిలకడైన రుచిని అందించడంలో లోపం వల్లే అన్ని బ్రాంచ్‌లు మూతపడ్డాయని, RP స్వయంగా తన వ్యాపారాన్ని నాశనం చేసుకున్నారని ప్రకాష్ అభిప్రాయపడ్డారు. తన చేపల దుకాణాలు బంద్ పెట్టిన ఆర్పీ ప్రస్తుతం టీడీపీలో యాక్టివ్‌గా పనిచేస్తున్న విషయం తెలిసిందే.

పచ్చళ్ల ప్రకాష్ తన సుదీర్ఘ సినీ ప్రస్థానంలో నాణ్యత, నిబద్ధతలకు ఎంతటి ప్రాధాన్యతనిస్తారో వివరించారు. 40 ఏళ్లుగా షూటింగ్‌లకు ఫుడ్ సప్లై చేస్తూ మంచి పేరు తెచ్చుకోవడానికి కారణం నాణ్యత, శుభ్రత, రుచిని ఎప్పుడూ కాపాడుకోవడమేనని అన్నారు. క్యాటరింగ్ వ్యాపారంలో కూడా ఇదే సూత్రాన్ని పాటించి విజయం సాధించానని పేర్కొన్నారు. డబ్బు కంటే పేరే ముఖ్యమని, పేరు వచ్చిన తర్వాత దాన్ని కాపాడుకోవడమే నిజమైన విజయమని ఆయన ఉద్ఘాటించారు.

ఈ ఇంటర్వ్యూలో ప్రకాష్ గారు ఒక సంచలన విషయాన్ని కూడా వెల్లడించారు. తాను ఒక ప్రముఖ హీరోయిన్‌ను చిత్ర పరిశ్రమకు పరిచయం చేశానని తెలిపారు. నీతోడు కావాలి సినిమా ప్రొడక్షన్ చీఫ్‌గా ఉన్న సమయంలో, 14 ఏళ్ల వయసున్న ఆ అమ్మాయిని చూసి హీరోయిన్‌గా చేయాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. ఎనిమిది నెలల పాటు తన ఇంట్లోనే పెట్టుకొని, ఫోటోషూట్‌లు చేయించి, లారెన్స్ మాస్టర్ వద్దకు తీసుకెళ్లి పరిచయం చేశారు. ఆ తర్వాత కృష్ణవంశీ, రమేష్ కృష్ణలు కలిసి తీసిన శ్రీ ఆంజనేయం సినిమాకు ఆమెను హీరోయిన్‌గా ఎంపిక చేయించడంలో కీలక పాత్ర పోషించారు. ఆ హీరోయిన్ మరెవరో కాదు ఛార్మీ. శ్రీ ఆంజనేయం తర్వాత ఛార్మీ.. మాస్, స్టైల్, రాఖీ, చక్రం వంటి అనేక విజయవంతమైన చిత్రాలలో నటించి స్టార్ హీరోయిన్‌గా ఎదిగిందని ప్రకాష్ పంచుకున్నారు. ఆమె ఇప్పటికీ తనను బాగా చూసుకుంటుందని ప్రకాష్ సంతోషంగా చెప్పారు.

తన కుమారుడి సినీరంగ ప్రవేశం గురించి కూడా ప్రకాష్ మాట్లాడారు. తన కుమారుడు బాల నటుడిగా దేవుళ్ళు, సమరసింహారెడ్డి, నరసింహానాయుడు, సింహాద్రి, ఆది వంటి దాదాపు 46 చిత్రాలలో నటించాడని తెలిపారు. త్వరలో హీరోగా పరిచయం చేయడానికి ప్రణాళికలు వేస్తున్నామని, అయితే స్టోరీ ఫైనల్ అవ్వలేదని చెప్పారు.

పవన్ కళ్యాణ్ కుటుంబంతో తనకున్న అనుబంధాన్ని కూడా ప్రకాష్ పంచుకున్నారు. పవన్ కళ్యాణ్ పిల్లలు, అఖీరా నందన్, ఆద్య షూటింగ్‌లకు వచ్చినప్పుడు వారికి భోజనం తానే అందిస్తానని తెలిపారు. అఖీరా చాలా పొడవుగా, పవన్ కళ్యాణ్, వరుణ్ తేజ్ కంటే కూడా ఎత్తుగా ఉంటాడని, తప్పకుండా హీరో అవుతాడని ప్రకాష్ విశ్వాసం వ్యక్తం చేశారు.

అయ్యప్ప మాల వేసిన తొలి తెలుగు నటి.. ప్రస్తుతం ఏం చేస్తున్నారంటే..? 

Follow Us