
సినీ తారల వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఏ చిన్న విషయం బయటకు వచ్చినా అది క్షణాల్లోనే వార్తల్లో నిలుస్తుంది. సోషల్ మీడియాలో అయితే సెకన్స్ లోనే వైరల్ అవ్వడం.. వాటిమీద రకరకాల వార్తలు పుట్టుకురావడం కూడా జరిగిపోతాయి. ముఖ్యంగా హీరోయిన్ల పెళ్లి వార్తలకు సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ఒకప్పుడు వెండితెరపై అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న కొందరు హీరోయిన్లు.. ఆ తర్వాత రాజకీయ కుటుంబాల్లోకి అడుగుపెట్టి సినిమాలకు దూరమయ్యారు. ఈ లిస్ట్ లో చాలా మంది ఉన్నారు. ఒకప్పటికి హీరోయిన్స్ దగ్గర నుంచి లేటెస్ట్ యంగ్ హీరోయిన్స్ వరకు చాలా మంది పొలిటికల్ లీడర్స్ ను పెళ్లి చేసుకొని కొత్త జీవితాలను మొదలుపెట్టారు. వారిలో ఈ హీరోయిన్ ఒకరు. ఆమె పేరు రాధిక కుమారస్వామి. కన్నడ చిత్ర పరిశ్రమలో హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె.. తెలుగులోనూ ఓ సినిమాలో నటించింది. అయితే, ఆ తర్వాత రాజకీయ నాయకుడిని వివాహం చేసుకోవడంతో ఆమె వ్యక్తిగత జీవితం కూడా ఆసక్తికరంగా మారింది. ఇంతకీ రాధిక కుమారస్వామి సినీ ప్రస్థానం ఎలా సాగింది? ఆమెను వివాహం చేసుకున్న రాజకీయ నాయకుడు ఎవరో తెలుసా.?
రాధిక కుమారస్వామి చిన్న వయసులోనే సినిమాల్లోకి అడుగుపెట్టింది. తన తొలి సినిమా సమయంలో ఆమె తొమ్మిదో తరగతి చదువుతున్నట్లు పలు కథనాలు వచ్చాయి. కన్నడ చిత్ర పరిశ్రమలో వరుస అవకాశాలు అందుకుంటూ నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది రాధిక. 2000వ దశకంలో కన్నడలో ప్రముఖ నటిగా ఎదిగిన రాధిక.. తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తర్వాత తమిళ చిత్ర పరిశ్రమలోకి కూడా అడుగుపెట్టింది. యార్కై సినిమాతో తమిళ ప్రేక్షకులకు పరిచయమైంది. కన్నడతో పాటు ఇతర భాషల్లోనూ నటిస్తూ తన సినీ ప్రయాణాన్ని కొనసాగించింది. కన్నడ సినిమాలతో బిజీగా ఉన్న రాధిక కుమారస్వామి తెలుగులోనూ ఓ సినిమాలో నటించింది. దివంగత నటుడు తారకరత్న హీరోగా నటించిన భద్రాద్రి రాముడు సినిమాలో ఆమె హీరోయిన్ గా కనిపించింది.
2004లో విడుదలైన ఈ చిత్రంలో రాధిక రెండు విడిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రల్లో నటించి మెప్పించింది. అయితే ఈ సినిమా ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. అనంతరం అవతారం అనే సినిమాలోనూ నటించింది. ఆ తర్వాత ఆమె తెలుగులో పెద్దగా సినిమాలు చేయలేదు. నటనతో పాటు నిర్మాణ రంగంలోనూ అడుగుపెట్టిన ఆమె రెండు సినిమాలను నిర్మిస్తుంది. కాగా కెరీర్ పీక్ లో ఉండగానే కర్ణాటకకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు హెచ్.డి. కుమారస్వామిని వివాహం చేసుకుంది. జనతాదళ్ (సెక్యులర్) పార్టీకి చెందిన కుమారస్వామి కర్ణాటక ముఖ్యమంత్రిగా రెండుసార్లు పనిచేశారు. రాధిక కుమారస్వామి, హెచ్.డి. కుమారస్వామి వివాహం కూడా అప్పట్లో వార్తల్లో నిలిచింది. పలు కథనాల ప్రకారం, వీరిద్దరి మధ్య 27 ఏళ్ల వయసు తేడా ఉంది. కుమారస్వామికి అంతకుముందే అనిత కుమారస్వామితో వివాహం జరిగింది. మరోవైపు రాధికకు కూడా ఇది రెండో వివాహమే. అంతకుముందు ఆమె రతన్ కుమార్‌ను వివాహం చేసుకుంది ఆమె.. చిన్న వయసులోనే సినిమాల్లోకి వచ్చి హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న రాధిక.. ఆ తర్వాత నిర్మాతగా మారి, రాజకీయ కుటుంబంలోకి అడుగుపెట్టింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.