
‘చికిరి… చికిరి..’ ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ పాటే వినిపిస్తోంది. శుభకార్యాలు, పెళ్లి వేడుకలు.. ఇలా ఏ ఫంక్షన్ చూసినా ఈ సాంగే వినిపిస్తోంది. ఇక సోషల్ మీడియాలో అయితే ఈ పాటకు సంబంధించిన రీల్స్, రీక్రియేషన్ వీడియోలే కనిపిస్తున్నాయి. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ అందించిన మ్యూజిక్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వేసిన ఎనర్జిటిక్ స్టెప్పులు అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. అందుకే చికిరి సాంగ్ కు విపరీతమైన క్రేజ్ పెరిగింది. యూట్యూబ్‌లో కూడా ఈ పాట వ్యూస్ వేగంగా పెరుగుతూ 100 మిలియన్ మార్క్(10 కోట్ల) ను దాటేసింది. ఈ క్రమంలో చాలా మంది చికిరి సాంగ్ కు రీల్స్ చేస్తున్నారు. రామ్ చరణ్ లాగే ఎనర్జిటిక్ డ్యాన్స్ మూవ్స్ చేస్తూ ఈ సూపర్ హిట్ సాంగ్ ను రీక్రియేట్ చేస్తున్నారు. అలా తాజాగాఓ బామ్మ పెద్ది సాంగ్ కు అద్దిరిపోయే స్టెప్పులేసింది. ఓ ఫంక్షన్ లో భాగంగా చికిరి సాంగ్ కు అద్బుతంగా డ్యాన్స్ చేసింది. అచ్చం రామ్ చరణ్ లానే ఎనర్జిటివ్ మూవ్ మెంట్స్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించింది. వయసుతో సంబంధం లేకుండా ఆ బామ్మ చూపించిన ఎనర్జీ, ఎక్స్ ప్రెషన్స్ చూసి అందరూ ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం ఈ బామ్మకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. దీనిని చూసిన నెటిజన్లు బామ్మ పై తెగ ప్రశంసలు కురిపిస్తున్నారు.
కాగా పెద్ది సినిమాకు ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ రామ్ చరణ్ తో రొమాన్స్ చేయనుంది. అలాగే కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు త్రిపాఠి, సత్య తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన సాంగ్స్, పోస్టర్స్, టీజర్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. చాలా భాగం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ పెద్ది సినిమా వచ్చ ఏడాది వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Chikiri Chikiri vibe is everywhere! 🔥 Even Grandma couldn’t resist the mass beat of #Peddi. Look at her energy! 💃⚡️@AlwaysRamCharan garu, you have the cutest competition here! 😎❤️#RamCharan #ChikiriChikiriSong #ViralVideo #GrandmaDance #Tollywood pic.twitter.com/c7cOuEro6L
— Rachakonda Sagar (@Sagar0i) December 2, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.