Arjuna Phalguna Movie: ‘అర్జున ఫల్గుణ’ నుంచి అందమైన పాట.. ఆకట్టుకుంటున్న మెలోడీ సాంగ్..

కమర్షియల్ చిత్రాలను తెరకెక్కిస్తూనే అద్భుతమైన కథలను ఎంపిక చేసుకుంటూ యంగ్ టాలెంట్‌ను ప్రోత్సహిస్తోంది మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్.

Arjuna Phalguna Movie: అర్జున ఫల్గుణ నుంచి అందమైన పాట.. ఆకట్టుకుంటున్న మెలోడీ సాంగ్..
Sri Vishnu

Updated on: Dec 22, 2021 | 7:43 PM

Arjuna Phalguna Movie: కమర్షియల్ చిత్రాలను తెరకెక్కిస్తూనే అద్భుతమైన కథలను ఎంపిక చేసుకుంటూ యంగ్ టాలెంట్‌ను ప్రోత్సహిస్తోంది మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్. ప్రస్తుతం ఈ ప్రొడక్షన్ కంపెనీ శ్రీ విష్ణు హీరోగా అర్జున ఫల్గుణ సినిమాను తెరకెక్కిస్తోంది. విభిన్న మైన కథలను ఎంచుకుంటూ.. కెరీర్ ను దూసుకుపోతున్నాడు ఈ కుర్ర హీరో.. ఈ క్రమంలోనే అర్జున ఫల్గుణ చేశాడు. ఈ చిత్రం డిసెంబర్ 31న థియేటర్లలో విడుదల కానుంది. ప్రియదర్శన్ బాలసుబ్రమణియన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. తాజాగా చిత్రంలోని ఒక తీయని మాటతో సాంగ్ లిరికల్ వీడియో విడుదల చేశారు చిత్రయూనిట్. ఓక తీయని మాటతో సాంగ్‌ హీరో శ్రీవిష్ణు.. హీరోయిన్ అమృత అయ్యర్‌తో రిలేషన్‌లోని ఆనందాన్ని వ్యక్తం చేసే రొమాంటిక్ మెలోడీ. ఈ పాటకు చైతన్య ప్రసాద్ సాహిత్యం అందించారు. శశ్వత్ సింగ్, శ్రేయా అయ్యర్ ఈ పాటను పాడారు. విజువల్‌ పరంగా.. ఈ పాట చక్కగా, లవ్లీగా కనిపిస్తుంది.

ఇక ఇటీవలే విడుదలైన ఈ సినిమా టీజర్‌కు అద్భుతమైన స్పందన లభించింది. గతంలో విడుదలైన పాటలు కూడా సంగీత ప్రియులను ఆకట్టుకున్నాయి. ఎన్ ఎమ్ పాషా కో ప్రొడ్యూసర్‌గా మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ఈ చిత్రాన్ని నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కథ, కథనం, దర్శకత్వ బాధ్యతలను తేజ మర్ని నిర్వహిస్తున్నారు. పి. సుధీర్ వర్మ మాటలు అందించారు. పి. జగదీష్ చీకటి.. సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు.  నరేష్, శివాజీ రాజా, సుబ్బ రాజు, దేవీ ప్రసాద్, రంగస్థలం మహేష్, రాజ్ కుమార్ చౌదరి (రాజా వారు రాణి గారు ఫేమ్), చైతన్య (మిడిల్ క్లాస్ మెలోడీస్ ఫేమ్) తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Dharmasthali: ష‌క‌ల‌క శంక‌ర్ హీరోగా రానున్న ‘ధ‌ర్మ‌స్థ‌లి’.. ఆకట్టుకుంటున్న ట్రైలర్

S. Thaman: నాన్న చనిపోయినప్పుడు వచ్చిన డబ్బులే నా జీవితాన్ని మార్చేశాయి.. ఎమోషనల్ అయిన తమన్..

NTR: బాలీవుడ్‌ ఎంట్రీకి రంగం సిద్ధం చేసుకుంటున్న జూనియర్‌ ఎన్టీఆర్‌.. ఏ క్షణమైనా..

Loading...
Unable to load recommendations.
Follow Us