Regina Cassandra- Nivetha Thomas: ఈ ఇద్దరి ముద్దుగుమ్మల ఆశలన్నీ ఒక్క సినిమా పైనే

సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిలిమ్స్, క్రాస్ పిక్చర్స్ కాంబినేషన్‌లో ఓ బేబీ వంటి సూపర్ హిట్ మూవీ తర్వాత రెండో చిత్రంగా శాకిని డాకిని ప్రాజెక్ట్‌ను రూపొందిస్తున్నారు.

Regina Cassandra- Nivetha Thomas: ఈ ఇద్దరి ముద్దుగుమ్మల ఆశలన్నీ ఒక్క సినిమా పైనే
Nivetha Thomas , Regina

Updated on: Dec 14, 2021 | 8:04 AM

Regina Cassandra- Nivetha Thomas: సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిలిమ్స్, క్రాస్ పిక్చర్స్ కాంబినేషన్‌లో ఓ బేబీ వంటి సూపర్ హిట్ మూవీ తర్వాత రెండో చిత్రంగా శాకిని డాకిని ప్రాజెక్ట్‌ను రూపొందిస్తున్నారు. డి. సురేష్ బాబు, సునీత తాటి, హ్యున్ వ్యూ థామస్ కిమ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సుధీర్ వర్మ ఈ చిత్రానికి దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో రెజీనా, నివేదా థామస్‌లు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. నివేదా థామస్ పుట్టిన రోజు సందర్భంగా నవంబర్ 2న విడుదల చేసిన టైటిల్ పోస్టర్‌కు విశేషమైన స్పందన వచ్చింది. రీసెంట్ గా రెజీనా పుట్టిన రోజు సందర్బంగా మేకర్లు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో రెజానీ, నివేదా థామస్‌లు ఇద్దరూ కూడా మిలటరీ యూనిఫాంలో ఉన్నారు. ఏదో తప్పు చేసి దొరికినట్టు, పనిష్మెంట్ తీసుకున్నట్టు కనిపిస్తోంది. పోస్టర్‌ను చూస్తుంటే సినిమా మీద ఆసక్తిని పెంచుతోంది. ఇక ఈ చిత్రంలో హీరోయిన్లు ఇద్దరూ కూడా మొదటిసారిగా యాక్షన్ సీక్వెన్స్‌లు చేశారు.

మిస్ గ్రానీ సినిమా యూనివర్సల్ కథ కావడంతో ఓ బేబీగా రీమేక్ చేయడంతో అది బ్లాక్ బస్టర్ హిట్ అయింది. మిడ్ నైట్ రన్నర్స్ కథ కూడా గ్లోబల్ అప్పిల్ ఉంటుంది. ఇది తెలుగు ఆడియెన్స్‌కు కనెక్ట్ అయ్యే కథే.. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో చిత్రయూనిట్ బిజీగా ఉంది. ఈ చిత్రానికి రచర్డ్ ప్రసాద్ కెమెరామెన్‌గా, మిక్కీ మెల్క్రెరీ సంగీతాన్ని అందిస్తున్నారు. మరో ఈ సినిమాకూడా ఓ బేబీ తరహాలో విజయం సాదిస్తుందేమో చూడాలి. ఇక చాలా కాలంగా సరైన హిట్ లేక సతమతం అవుతున్న రెజీనా ఈ సినిమా పైనే ఆశలు పెట్టుకుంది. ఈ సినిమాతో తిరిగి తెలుగులో రాణించాలని చూస్తుంది ఈ అమ్మడు. అలాగే నివేద కూడా ఈ సినిమాతో తిరిగి ఫామ్ లోకి రావాలని చూస్తుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

AHA Studio: మరో ముందడుగు వేసిన ఆహా.. ఇకపై ఆహా స్టూడియో ద్వారా పాన్‌ ఇండియా వెబ్‌ సిరీస్‌లు..

Allu Arjun: ‘మీరు నాపై చూపిస్తున్న ప్రేమే నా అతి పెద్ద ఆస్తి’.. ఫ్యాన్స్‌ గాయపపడంపై స్పందించిన బన్నీ..

Rashmika: అది మాములు విషయం కాదు, సమంతను చూసి షాకయ్యా.. ఆసక్తికర విషయాలు వెల్లడించిన రష్మిక మందన్నా..

Follow Us