Niharika Konidela: మెగా డాటర్ నిహారిక కొత్త సినిమా.. టైటిల్ చాలా కొత్తగా ఉందిగా.. హీరో ఎవరంటే?

కమిటీ కుర్రోళ్లు, రాకాస సినిమాలతో నిర్మాతగా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంది మెగా డాటర్ నిహారిక కొణిదెల. ప్రస్తుతం ఆమె తన సోదరుడు వరుణ్ తేజ్ తో కలిసి బరి అనే స్పోర్ట్స్ డ్రామాను తెరకెక్కిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా మరో కొత్త సినిమాను అనౌన్స్ చేశారు మెగా డాటర్.

Niharika Konidela: మెగా డాటర్ నిహారిక కొత్త సినిమా.. టైటిల్ చాలా కొత్తగా ఉందిగా.. హీరో ఎవరంటే?
Niharika Konidela

Updated on: Oct 28, 2026 | 10:24 PM

నిహారిక కొణిదెల పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, మాక్సిమం సిటీ స్టూడియోస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న నూతన చిత్రం ‘పాకెట్ రాకెట్స్’. ఈ సినిమాకు రుద్ర అత్రి దర్శకత్వం వహించనున్నారు. యూత్ ఫుల్ ఎంటర్టైనర్‌గా రానున్న ఈ మూవీలో త్రినాథ్ వర్మ (కమిటీ కుర్రోళ్ళు ఫేమ్) , నిర్మల్ (డెబ్యూ) హీరోలుగా… శ్రియా కొంతం (శుభం ఫేమ్) హీరోయిన్‌గా నటిస్తున్నారు. జేడీ చక్రవర్తి ముఖ్యపాత్రలో కనిపించనున్నారు. గ్యాబ్లింగ్ చుట్టూ తిరిగే ఈ సినిమాకు సంబంధించిన టైటిల్‌‌ని, కాన్సెప్ట్ పోస్టర్‌ని బుధవారం నాడు రివీల్ చేశారు. విదేశాల్లో చదువుకోవాలని అనుకునే ఓ కుర్రాడు, ఆ కలను సాకారం చేసుకునేందుకు గ్యాబ్లింగ్‌లోకి దిగడం, ఆ తర్వాత ఆ కుర్రాడి జీవితంలో ఎదురైన పరిస్థితుల్ని ‘పాకెట్ రాకెట్స్’లో ఎంతో ఆసక్తికరంగా చూపించబోతోన్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తి అయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు మొదలయ్యాయి. త్వరలో టీజర్, రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు.

ఈ చిత్రానికి ఎదురోలు రాజు కెమెరామెన్‌గా, అన్వల్ అలీ ఎడిటర్‌గా వర్క్ చేయనున్నారు. ఈ మూవీకి గ్యానీ సంగీతాన్ని అందించనున్నారు. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన ఇతర వివరాల్ని ప్రకటించనున్నారు. ఈ సినిమాలో త్రినాథ్ వర్మ (కమిటీ కుర్రోళ్లు ఫేమ్), శ్రియా కొంతం (శుభం ఫేమ్), నిర్మల్ (డెబ్యూ హీరో), జేడీ చక్రవర్తి, శ్రీనివాస్ అవసరాల, శ్రీనివాస్ వడ్లమాని, కిరిటీ దామరాజు తదితరులు నటిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

బ్యానర్లు : పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, మాక్సిమం సిటీ స్టూడియోస్

నిర్మాతలు: పద్మజ కొణిదెల, రాహుల్ రాఘవేంద్ర, రాహుల్ నిమ్మకూరి

దర్శకుడు :రుద్ర అత్రి

కెమెరామెన్ :ఎదురోలు రాజు

మ్యూజిక్ :గ్యానీ

ఎడిటర్ : అన్వర్ అలీ

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : రమేష్ మన్యం

ప్రొడక్షన్ డిజైనర్ :విష్ణు వర్దన్ పుల్లా

యాక్షన్ కొరియోగ్రఫీ :రాజేష్ లంకా

కొరియెగ్రాఫర్ : జేడీ మాస్టర్

కాస్ట్యూమ్ డిజైనర్ : అనుషా దేవర

ఎస్ఎఫ్ఎక్స్ :సాయి మనీంధర్ రెడ్డి

కో డైరెక్టర్ :మురళీ కృష్ణ కట్టా

మేకప్ చీఫ్ :పసుపులేటి రవి కుమార్

కాస్ట్యూమ్ చీఫ్ :ఆర్. భూపాల్ రావు

ప్రొడక్షన్ కంట్రోలర్ : రవిందర్ బెక్కం

స్టిల్స్ : వరాహాల మూర్తి

ఈవెంట్ పార్టనర్: యువి మీడియా

మార్కెటింగ్: టికెట్ ఫ్యాక్టరీ

పీఆర్వో : ఎస్.కె. నాయుడు – ఫణి కందుకూరి (బియాండ్ మీడియా)

త్వరలోనే మరిన్ని వివరాలు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us