“ఇస్మార్ట్ శంకర్” సినిమాతో తెలుగు కుర్రకారుకు కళల రాకుమారిగా మారిపోయింది. ఈ మూవీ తర్వాత నిధి కెరీర్ ఒక్కసారిగా మారిపోయింది. వరుస ఆఫర్లను అందుకుంటూ టాప్ హీరోయిన్స్‌తో పోటీ పడుతుంది ఈ చిన్నది. ప్రస్తుతం ఈ బ్యూటీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన “హరిహర వీరమల్లు” సినిమాలో నటిస్తోంది. అయితే నిధికి సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. అలాగే తన వ్యక్తిగత వివరాలతోపాటు.. ఫోటోలను వీడియోలను షేర్ చేస్తూ.. ఎప్పుడూ అభిమానులకు అందుబాటులో ఉంటుంది. అంతేకాకుండా.. ఎప్పుడూ ఏదో మ్యాటర్ పై పోస్టులు పెడుతూ.. వార్తల్లో నిలుస్తుంటుంది. తాజాగా ఈ అమ్మడు నెటిజన్‌పై ఫైర్ అయ్యింది. అయితే తాజాగా నిధి అగర్వాల్ ఓ విషయం మీద బాగానే సీరియస్ అయ్యారు. అది కచ్చితంగా ఈ ఫోటోనే, ఈ విషయం మీదే అని తెలియడం లేదు. . తన ఫోటోలను మితిమీరి వాడుకుంటున్నారంటూ సీరియస్ అయ్యింది.
ఈ మేరకు తన ఇన్‌స్టా స్టోరీలో ఓ పోస్ట్ షేర్ చేసింది నిధి. అందులో.. నాకు సంబంధించిన ఈ ఫోటో అవసరం లేకపోయినా కూడా ఎప్పుడూ సర్క్యూలేట్ అవుతూనే ఉంది. వాస్తవానికి దానికి అంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎవరైన సరే తమ దృష్టికి అలాంటి ఫోటోలు వస్తే వాటిని షేర్ చేయకండి. అది అనవరం. అవి చీప్ పనులు. ఈ పనులతో మీరు మరింత దిగజారకండి అంటూ నిధి అగర్వాల్ ఆగ్రహం వ్యక్తం చేసింది.
ట్వీట్..