Naveen Polishetty: నవీన్ పొలిశెట్టికి బైక్ యాక్సిడెంట్.. షూటింగ్‏కు బ్రేక్ ?..

నవీన్ పొలిశెట్టికి బైక్ యాక్సిడెంట్ జరిగిందని.. చేతికి ఫ్యాక్చర్ కావడంతో వైద్యులు అతడికి రెండు నెలలు విశ్రాంతి తీసుకోవాలని సూచించారని తెలుస్తోంది. దీంతో అతడి రాబోయే సినిమా షూటింగ్స్ కు రెండు నెలలు ఆలస్యం కానున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వార్తలపై నవీన్ పొలిశెట్టి గానీ.. తన టీం గానీ రియాక్ట్ కాలేదు.

Naveen Polishetty: నవీన్ పొలిశెట్టికి బైక్ యాక్సిడెంట్.. షూటింగ్‏కు బ్రేక్ ?..
Naveen Polishetty

Updated on: Mar 28, 2024 | 1:02 PM

టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి ప్రమాదానికి గురైనట్లుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో ఉదయం నుంచి వైరలవుతుంది. ఈ ప్రమాదం షూటింగ్‏లో జరిగిందా ?.. లేదా ? అనేది క్లారిటీ తెలియరాలేదు. నవీన్ పొలిశెట్టికి బైక్ యాక్సిడెంట్ జరిగిందని.. చేతికి ఫ్యాక్చర్ కావడంతో వైద్యులు అతడికి రెండు నెలలు విశ్రాంతి తీసుకోవాలని సూచించారని తెలుస్తోంది. దీంతో అతడి రాబోయే సినిమా షూటింగ్స్ కు రెండు నెలలు ఆలస్యం కానున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వార్తలపై నవీన్ పొలిశెట్టి గానీ.. తన టీం గానీ రియాక్ట్ కాలేదు.

నవీన్ పొలిశెట్టి చివరిసారిగా మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి చిత్రంలో కనిపించారు. ఇందులో అనుష్క శెట్టి కథానాయికగా నటించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అందుకుంది. జాతిరత్నాలు తర్వాత ఆ రేంజ్ హిట్ మాత్రం అందుకోలేదు నవీన్. ఇప్పుడు ఆయన చేతిలో వరుస సినిమాలు ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే త్వరలోనే తన మూవీ అప్డేట్స్ ఇస్తానంటూ ట్వీట్ చేశాడు. ఈరోజు ఉదయం తన ఇన్ స్టాలో మిస్ శెట్టి.. మిస్టర్ పొలిశెట్టి సినిమాకు సంబంధించిన స్టోరీ షేర్ చేశారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us