
Jati Ratnalu Twitter Review: ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ ఫేమ్ నవీన్ పోలిశెట్టి ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా ‘జాతిరత్నాలు’. అనుదీప్ కేవీ ఈ చిత్రానికి దర్శకత్వం అందించగా.. మహానటి ఫేం డైరెక్టర్ నాగ్ అశ్విన్.. స్వప్న సినిమాస్ బ్యానర్‌పై ఈ నిర్మించాడు. కామెడీ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో ఫరియా అబ్దుల్లా హీరోయిన్గా తెలుగు తెరకు పరిచయమవుతోంది.
రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి కీలక పాత్రలు పోషించారు. మహాశివరాత్రి కానుకగా ఇవాళ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా, ఇప్పటికే అమెరికాలో ఈ చిత్రం ప్రీమియర్ షోలు ప్రారంభం కావడంతో అభిమానులు ట్విట్టర్ ద్వారా స్పందిస్తున్నారు. వారి అభిప్రాయాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..
మొదటి షో నుంచే ఈ చిత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకున్నట్లు తెలుస్తోంది. ఫస్టాఫ్ అదుర్స్ అని.. ఓ ఫన్ రైడర్ మాదిరిగా సినిమా సాగిపోతుందని అభిమానులు అంటున్నారు. ఫస్టాఫ్ బాగుందన్న ప్రేక్షకులు.. సెకండాఫ్‌లో కొన్ని సీన్స్ మినహా అంతా సూపర్బ్‌గా ఉందని.. హిట్టు బొమ్మ అని క్లారిటీ ఇస్తున్నారు. ఎప్పటిలానే నవీన్ తన యాక్టింగ్‌తో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాడని ప్రశంసిస్తున్నారు.
నవీన్, రాహుల్, ప్రియదర్శి మధ్య వచ్చే ప్రతీ సన్నివేశం ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుందట. అంతేకాకుండా వన్ లైన్ పంచ్‌లు అద్బుతంగా పేలాయని టాక్. హీరోగా నవీన్ పోలిశెట్టి తన ఖాతాలో మరో హిట్టును వేసుకున్నాడని అంటున్నారు. అడ్వాన్స్ బుకింగ్ కూడా అద్భుతంగా జరగడంతో.. ఈ సినిమా తొలిరోజు దాదాపుగా రూ. 7 కోట్ల వసూళ్లు సాధించే అవకాశం ఉందని అంచనా..
మరిన్ని ఇక్కడ చదవండి:
కన్న కొడుకు కోసం తండ్రి పోరాటం.. మొసలి పొట్ట కోసి బాలుడిని బయటికి తీశాడు.. కానీ.!
కోతిని అమాంతం మింగేసిన రాకాసి బల్లి.! ఒళ్లుగగుర్పొడిచే వీడియో.. నెట్టింట్లో వైరల్.!