Naveen Polishetty: తిరుమలలో తన మార్క్ ఫన్నీ కామెంట్స్.. నిజంగా నవీన్ జాతిరత్నమే

చక్కెర పొంగలి తినాలనే ఆశతో శ్రీవారి దర్శనానికి వచ్చానన్నారు జాతి రత్నాలు సినిమా హీరో నవీన్ పొలిశెట్టి. గురువారం ఉదయం ఆయన హీరోయిన ఫరియాతో కలిసి తిరుమల...

Naveen Polishetty: తిరుమలలో తన మార్క్ ఫన్నీ కామెంట్స్.. నిజంగా నవీన్ జాతిరత్నమే
Jaathi Ratnalu

Updated on: Mar 18, 2021 | 1:39 PM

చక్కెర పొంగలి తినాలనే ఆశతో శ్రీవారి దర్శనానికి వచ్చానన్నారు జాతి రత్నాలు సినిమా హీరో నవీన్ పొలిశెట్టి. గురువారం ఉదయం ఆయన హీరోయిన ఫరియాతో కలిసి తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయం బయట మీడియాతో మాట్లాడుతూ శ్రీవారి దర్శనానికి వచ్చేటప్పుడు చక్కెర పొంగలి దొరుకుంతుందా లేదా అనే సందేహంతో తిరుమలకు వచ్చాననీ, కానీ స్వామివారు చక్కెర పొంగలి దక్కేలా చేసి తమని ఆశీర్వదించాడని అన్నాడు. జాతి రత్నాలు సినిమాను బ్లాక్ బస్టర్ చేసిన తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. థియేటర్లలో జాతి రత్నాలు నవ్వుల పువ్వులు పూయిస్తున్నారన్నారు. స్వామివారి ఆశీస్సులతో విజయోత్సవ యాత్ర ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.

టాలీవుడ్ లో ఇపుడు చర్చ అంతా జాతిరత్నాలు సినిమా గురించే జరుగుతుంది. ఫుల్ ఫన్‌తో తెరకెక్కించిన ఈ చిత్రంలో న‌‌వీన్‌పొలిశెట్టి-ఫ‌రియా అబ్దుల్లా హీరోహీరోయిన్లుగా నటించిన విషయం తెలిసిందే.  అనుదీప్ కేవీ డైరెక్ష‌న్‌లో వ‌చ్చిన జాతిర‌త్నాలు ప్రస్తుతం భారీ కలెక్షన్లు సాధిస్తూ దూసుకెళ్తుంది.

 

బన్నీ వాసు వార్నింగ్ జాతిరత్నాలకేనా…

ఇటీవల నిర్మాత బన్నీ వాసు చేసిన కొన్ని కామెంట్స్ ఇండస్ట్రీలో కాకరేపుతున్నాయి. చావు కబురు చల్లగా ఈవెంట్‌లో బన్నీ వాసు చేసిన కామెంట్స్ అలజడి రేపాయి. అల్లు కుటుంబానికి అత్యంత సన్నిహితంగా మెలిగే బన్నీ వాసు..  చావు కబురు చల్లగా చిత్రం ఆహా ఓటీటీలో రెండు వారాల తర్వాత వస్తుందని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నార‌ని ఆగ్రహం వ్యక్తం చేశారు. మ‌రో నిర్మాత‌, పీఆర్వో టీమ్ కావాలనే ఈ ప్రచారం చేయిస్తున్నాడని చెప్పుకొచ్చాడు. వాళ్ల పేర్లు కూడా తనకు తెలుసని.. కానీ బయటకు చెప్పాల్సిన అవసరం లేదని పేర్కొన్నాడు. ఆయన జాతిరత్నాలు టీమ్‌కు సంబంధించిన వార్నింగ్ ఇచ్చినట్లు ఇండస్ట్రీలో చర్చ జరుగుతుంది.

Also Read:

Crime News Telangana: నీటి పారుదల శాఖ ఆఫీస్‌లో పని చేస్తున్న అధికారి.. అతగాడి చేతివాటం మీరే చూడండి

Telangana News: ఒకే తాటిచెట్టుపై 17మంది ఎక్కారు… అరెరే ఏంటీ చిత్రం.. తెలుసుకుందాం పదండి

Loading...
Unable to load recommendations.
Follow Us