Mission 2020 Movie : విడుదలకు సిద్ధం అవుతున్న నవీన్ చంద్ర సినిమా.. సందేశాత్మక కథతో రూపొందిన ‘మిషన్ 2020’

|

Feb 19, 2021 | 2:03 PM

హనీ బన్నీ క్రియేషన్స్ సమర్పణలో మధు మృదు ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై శ్రీ మిత్ర & మై విలేజ్ సమర్పణలో నవీన్ చంద్ర హీరో  నటిస్తున్న సినిమా 'మిషన్ 2020'. బీహార్ చీఫ్ మినిస్టర్ నితీష్ కుమార్ గారి ప్రేరణ తో యదార్ధ సంఘటనల..

Mission 2020 Movie : విడుదలకు సిద్ధం అవుతున్న నవీన్ చంద్ర సినిమా.. సందేశాత్మక కథతో  రూపొందిన మిషన్ 2020
Follow us on

Mission 2020 Movie : హనీ బన్నీ క్రియేషన్స్ సమర్పణలో మధు మృదు ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై శ్రీ మిత్ర మై విలేజ్ సమర్పణలో నవీన్ చంద్ర హీరో  నటిస్తున్న సినిమా ‘మిషన్ 2020’. బీహార్ చీఫ్ మినిస్టర్ నితీష్ కుమార్ గారి ప్రేరణ తో యదార్ధ సంఘటనల ఆధారంగా  రాజకీయ నేపథ్యంలోఈ సినిమా తెరకెక్కుతోందని తెలుస్తుంది. కరణం బాబ్జి ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా కుంట్లూర్ వెంకటేష్ గౌడ్ మరియు కె వి ఎస్ ఎస్ ఎల్ రమేష్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం మార్చ్ 5న విడుదలకు సిద్ధం అయ్యింది.

నిర్మాత కుంట్లూర్ వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ ” నిర్మాతగా మేము చేస్తున్న మొదటి సినిమా ఇది. ఈ సినిమాను చూసి ఏషియన్ సిమాస్ వారు విడుదల చేయడం చాలా ఆనందంగా ఉంది. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు అందించిన వాళ్లకు ఈ సినిమా నచ్చిందంటే అక్కడే మేము సక్సెస్ అయినట్టు. సమాజానికి కావలసిన మంచి సందేశంతో ఈ చిత్రాన్ని నిర్మించాం . తప్పకుండా మార్చ్ 5న నైజం లో ఏషియన్ సిమాస్ ద్వారా విడుదల అవుతున్న ఈ సినిమా పెద్ద విషయం సాధిస్తుందన్న నమ్మకం ఉంది అన్నారు. దర్శకుడు కరణం బాబ్జి మాట్లాడుతూ ” చిన్న సినిమాగా తీసాం ఈ సినిమాను కానీ ఈ సినిమా చుసిన ఏషియన్ సిమాస్ సునీల్ నారంగ్ గారు నైజం లో విడుదల చేయడం ఆనందంగా ఉంది. ఈ సినిమాను వాళ్ళు విడుదల చేయడంతోనే మేము సగం సక్సెస్ అయినట్టు భావిస్తున్నాం అన్నారు. నేటి సమాజంలో జరుగుతున్నా పరిస్థితులకు అద్దం పట్టేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం” అన్నారు. మరి ఈ సినిమా నవీన్ చంద్రకు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Naandhi Movie Review : ఊహించినట్టే అద్భుత నటనతో ఆకట్టుకున్న నరేష్.. నాంది సినిమా పై ప్రేక్షకులు ఏమంటున్నారంటే..

Uppena collections : కలెక్షన్స్‌‌‌‌‌లోను ‘ఉప్పెన’లా ఎగసి పడుతున్న మెగాహీరో డెబ్యూ మూవీ.. వారం రోజుల్లో ఎంత వసూల్ చేసిందంటే..