Actor Nani : వరుస సినిమాలతో దూసుకొస్తున్న నేచురల్ స్టార్.. రెమ్యునరేషన్ పెంచేసిన నాని.?

టాలీవుడ్ యంగ్ హీరోస్ లో నాని ఒకరు. నాని హిట్లు ఫలపులతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. గత ఏడాది 'వి' సినిమాతో ప్రేక్షకులను పలకరించిన నాని.

Actor Nani : వరుస సినిమాలతో దూసుకొస్తున్న నేచురల్ స్టార్.. రెమ్యునరేషన్ పెంచేసిన నాని.?

Updated on: Feb 13, 2021 | 1:04 AM

Actor Nani : టాలీవుడ్ యంగ్ హీరోస్ లో నాని ఒకరు. నాని హిట్లు ఫలపులతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. గత ఏడాది ‘వి’ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన నాని. త్వరలో టక్ జగదీష్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. నాని నిన్నుకోరిలాంటి మంచి హిట్ అందించిన శివ నిర్వాణ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.

ఈ సినిమాతోపాటు శ్యామ్ సింగరాయ్ అనే సినిమా చేస్తున్నాడు. టాక్సీవాలా సినిమాతో హిట్ అందుకున్న రాహుల్ సాంకృత్యాయన్  ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా కలకత్తా బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కనుందని తెలుస్తుంది. ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గ నటిస్తుందని తెలుస్తుంది. ఇక ఈ సినిమాతోపాటు వివేక్ ఆత్రేయ దర్శకత్వలో ఓ సినిమా చేస్తున్నాడు. ‘అంటే సుందరానికి’ అనే ఇంట్రస్టింగ్ టైటిల్ తో ఈ సినిమా రాబోతుంది. ఇలా వరుస సినిమాలతో బిజీగా ఉన్న నాని తన రెమ్యునరేషన్ కూడా పెంచేసాడని వార్తలు వినిపిస్తున్నాయి. నాని సినిమాలకు కనీసం పదిహేను కోట్లవరకు పారితోషికం తీసుకోబోతున్నట్లు ఇండస్ట్రీ టాక్. కరోనా తర్వాత సినిమా ఇండస్ట్రీ ఊపందుకుంది. దాంతో తారలంతా రెమ్యునరేషన్ పెంచేస్తున్నారు. ఇప్పడు నాని కూడా అదే దారిలో వెళ్తున్నాడు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Actress Soundarya : త్వరలో తెర పైకి అందాల తార సౌందర్య జీవిత కథ.. హీరోయిన్‌‌‌‌‌గా ఆ నటి..?

 

Loading...
Unable to load recommendations.
Follow Us