Naresh and Pavitra Lokesh: త్వరలోనే పవిత్ర లోకేష్ ను పెళ్లి చేసుకుంటా.. క్లారిటీ ఇచ్చిన నరేష్

నరేష్, నటి పవిత్ర లోకేష్ కు సంబంధించిన వార్తలు ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపించాయి. వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారని.. త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారని వార్తలు పుట్టుకొచ్చాయి. తాజాగా ఈ ఇద్దరు కలిసి మళ్లీ పెళ్లి అనే సినిమా చేస్తున్నారు.

Naresh and Pavitra Lokesh: త్వరలోనే పవిత్ర లోకేష్ ను పెళ్లి చేసుకుంటా.. క్లారిటీ ఇచ్చిన నరేష్
Naresh, Pavitra Lokesh

Updated on: May 19, 2023 | 2:17 PM

టాలీవుడ్ లో ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తోన్న పేర్లు నరేష్, పవిత్ర లోకేష్. నరేష్, నటి పవిత్ర లోకేష్ కు సంబంధించిన వార్తలు ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపించాయి. వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారని.. త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారని వార్తలు పుట్టుకొచ్చాయి. తాజాగా ఈ ఇద్దరు కలిసి మళ్లీ పెళ్లి అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలకు ఎమ్ఎస్ రాజు దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో ఈ సినిమాకు సంబంధించిన ఫోటోలను, పెళ్లి వీడియోను షేర్ రిలీజ్ చేసి ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచేశారు. ఈ ఇద్దరు కలిసి ఇప్పుడు మళ్ళీ పెళ్లి అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమా ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉన్నారు ఈ క్రేజీ జంట. అయితే పవిత్ర లోకేష్ నరేష్ త్వరలోనే పెళ్లి చేసుకోబుతున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా మళ్లీ పెళ్లి మూవీ ప్రమోషన్స్ లో క్లారిటీ ఇచ్చారు నరేష్. త్వరలోనే పవిత్ర లోకేష్ ను పెళ్లి చేసుకుంటానని అన్నారు నరేష్.

నిజానికి పెళ్లి అనేది అంత ఖచ్చితంగా  అవసరం లేదు అన్నారు  నరేష్.. చాలా మంది ఇష్టం లేకుండా , సమాజం కొసం పెళ్లి అనే బంధంలో ఉంటున్నారు. అలాంటి వారికోసమే ఈ సినిమా అన్నారు. అలాగే నాకు పవిత్రకు ఇంకా పెళ్లి కాలేదు. మా మనసులు కలిశాయి అందుకే కలిసి ఉంటున్నాం.. త్వరలోనే పవిత్రను పెళ్లి చేసుకుంటా అని నరేష్ అన్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us