Ante Sundaraniki: పంచెకట్టుతో అమెరికాలో చక్కర్లు కొడుతున్న నేచురల్ స్టార్..అంటే సుందరానికి.. నుంచి ఫస్ట్ సింగిల్

నేచురల్ స్టార్ నాని ఇటీవలే శ్యామ్ సింగరాయ్ సినిమాతో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. ఈ సినిమా మంచి విజయం అందుకోవడంతో నాని తిరిగి ఫామ్ లోకి వచ్చారు.

Ante Sundaraniki: పంచెకట్టుతో అమెరికాలో చక్కర్లు కొడుతున్న నేచురల్ స్టార్..అంటే సుందరానికి.. నుంచి ఫస్ట్ సింగిల్
Nani

Updated on: Apr 06, 2022 | 8:47 PM

నేచురల్ స్టార్ నాని(Nani) ఇటీవలే శ్యామ్ సింగరాయ్ సినిమాతో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. ఈ సినిమా మంచి విజయం అందుకోవడంతో నాని తిరిగి ఫామ్ లోకి వచ్చారు. ఇప్పుడు ఇదే ఊపులో తన నెక్స్ట్ సినిమాను శరవేగంగా పూర్తి చేస్తున్నాడు. నేచురల్ స్టార్ నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ‘అంటే సుందరానికి'(Ante Sundaraniki) చిత్రం జూన్ 10న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. వివేక్ సాగర్ మ్యూజిక్ అందిస్తున్న ఈ చిత్రం నుంచి తాజాగా ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేశారు. ‘పంచెకట్టు’ అంటూ సాగే పాటని విడుదల చేశారు.

వివేక్ సాగర్ ఈ పాట కోసం ఓ క్యాచి ట్యూన్ కంపోజ్ చేశారు. హసిత్ గోలీ రాసిన లిరిక్స్ కూడా ట్రెండీ ఉంటూ వినగానే హుషారు గా డ్యాన్స్ చేసేలా ఈ పాటని స్వరపరిచారు. లెజెండరీ కర్ణాటిక్ క్లాసికల్ గాయని అరుణా సాయిరామ్ ఈ పాటని ఆలపించడం అదనపు ఆకర్షణ తెచ్చిపెట్టింది. ఈ ఫస్ట్ సింగిల్ లో సుందరం క్యారెక్టర్ ని కూడా ఎస్టాబ్లిష్ చేశారు. పాటలో నాని బాడీ లాంగ్వేజ్ ఆకట్టుకుంది. ఈ పాటలో న్యూయార్క్ లోని టైమ్స్ స్క్వేర్ తో సహా అమెరికాలోని పాపులర్ ప్రదేశాల చుట్టూ తిరుగుతూ కనిపించారు నాని. ఈ పాట ఇన్స్టంట్ హిట్ కావడంతో సుందరం సంగీత ప్రయాణం అద్భుతంగా ప్రారంభమైనట్లయింది. ఈ చిత్రంలో నాని సరసన నజ్రియా నజీమ్ కథానాయికగా నటించడంతో పాటు ఈ సినిమా తోనే ఆమె టాలీవుడ్ అరంగేట్రం చేయడం మరో విశేషం. ఈ సినిమాలో నజ్రియా, లీలా థామస్ అనే పాత్రలో సందడి చేయనుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Akkineni Naga Chaitanya: స్పీడ్ పెంచిన నాగచైతన్య.. డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో చైతూ..

Aamna Sharif: డిఫరెంట్ ఫోజులతో మెస్మరైజ్ చేస్తున్న ఆమ్నా షరీఫ్.. ఫిదా అవుతున్న ఫ్యాన్స్

Ram Charan: అయ్యప్ప దీక్షలో అమృత సర్‌లో ల్యాండ్ అయిన రామ్ చరణ్.. నెక్స్ట్ సినిమా షూటింగ్‌తో బిజిబిజీ

Loading...
Unable to load recommendations.
Follow Us