Taraka Ratna: తారకరత్న కోరిక తీర్చనున్న భార్య అలేఖ్య !! భర్త మరణం నుంచి తిరిగి కోలుకునేలా బాలకృష్ణ కీలక నిర్ణయం!

తారకరత్నను ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య అలేఖ్యా రెడ్డి ఆవేదనను ఎవరూ ఆపలేకపోతున్నారు. అలేఖ్యను తిరిగి మామూలు మనిషిని చేయాలని కుటుంబ సభ్యులు ఎంతగా ప్రయత్నిస్తున్నా ఆమె మాత్రం భర్త జ్ఞాపకాలతో మానసికంగా కృంగిపోతోంది.

Taraka Ratna: తారకరత్న కోరిక తీర్చనున్న భార్య అలేఖ్య  !! భర్త మరణం నుంచి తిరిగి కోలుకునేలా బాలకృష్ణ కీలక నిర్ణయం!
Taraka Ratna

Updated on: Feb 27, 2023 | 6:10 AM

నందమూరి తారకరత్న మరణం అతని కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఇప్పటికీ ఆయన చనిపోయారన్న నిజాన్ని చాలామంది జీర్ణించు కోలేకపోతున్నారు. ఇక తారకరత్నను ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య అలేఖ్యా రెడ్డి ఆవేదనను ఎవరూ ఆపలేకపోతున్నారు. అలేఖ్యను తిరిగి మామూలు మనిషిని చేయాలని కుటుంబ సభ్యులు ఎంతగా ప్రయత్నిస్తున్నా ఆమె మాత్రం భర్త జ్ఞాపకాలతో మానసికంగా కృంగిపోతోంది. ఇదిలా ఉంటే తారకరత్న ఫ్యామిలీకి అన్ని విధాలా అండగా నిలుస్తున్నారు నందమూరి బాలకృష్ణ. ఈక్రమంలో తారకరత్న భార్య తిరిగి కోలుకునేలా చేయడానికి బాలకృష్ణ కీలక నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ఆమెను బిజీగా ఉంచడానికి రాజకీయాల్లోకి తీసుకురావాలని బాలయ్య ఆలోచిస్తున్నారట. తద్వారా రాజకీయాల్లోకి రావాలన్న తారకరత్న కోరికను అలేఖ్య ద్వారా తీరేలా టీడీపీ అధినేత చంద్రబాబుతో సమాలోచనలు చేస్తున్నారట బాలయ్య. మొదట తెలుగు దేశం పార్టీ మహిళా విభాగంలో అలేఖ్యకు కీలక పదవి వచ్చేలా చేసి రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయించాలని అనుకుంటున్నారట. అయితే ఈ విషయంపై ఇంకా అధికారిక సమాచారమేమీ లేదు.

కాగా సినిమాల్లో ట్యాలెంటెడ్‌ యాక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్న తారకరత్న రాజకీయాల్లోకి రావాలని ఎన్నో కలలు కన్నాడు. వచ్చే ఎన్నికల్లోనూ ఎమ్మెల్యేగా బరిలోకి దిగాలనుకున్నాడు. ఇందులో భాగంగానే నారా లోకేశ్‌ యువగళం పాదయాత్రలోనూ భాగస్వామి కావాలనుకున్నాడు. అయితే తానొకటి తలిస్తే విధి మరోలా తలచింది. పాదయాత్రలో గుండెపోటుతో కుప్పకూలిన ఆయన తన కోరిక నెరవేరకుండానే తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయాడు. ఇప్పుడు ఆ కోరికను తారకరత్న భార్య అలేఖ్యతో తీర్చేలా బాలకృష్ణ చొరవ తీసుకుంటున్నారట. మరి దీనిపై అలేఖ్య ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us