Balakrishna: డైనమిక్ డైరెక్టర్‌తో నటసింహం మరో సినిమా.. పూరీజగన్నాథ్ మూవీని బాలయ్య పట్టాలెక్కించేది అప్పుడే..?

|

Jan 06, 2022 | 4:24 PM

అఖండ సినిమాతో ఘనవిజయాన్ని సాధించిన నటసింహం బాలకృష్ణ ఇప్పుడు ఆయన తర్వాత సినిమా పై ఫోకస్ పెట్టారు.

Balakrishna: డైనమిక్ డైరెక్టర్‌తో నటసింహం మరో సినిమా.. పూరీజగన్నాథ్ మూవీని బాలయ్య పట్టాలెక్కించేది అప్పుడే..?
Balakrishna
Follow us on

Balakrishna: అఖండ సినిమాతో ఘనవిజయాన్ని సాధించిన నటసింహం బాలకృష్ణ ఇప్పుడు ఆయన తర్వాత సినిమా పై ఫోకస్ పెట్టారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన అఖండ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. బాలకృష్ణ ద్విపాత్రాభినయంలో నటించి ఆకట్టుకున్నారు ఈ సినిమాలో ముఖ్యంగా అఘోరాగా బాలయ్య నటన ప్రేక్షకులను కట్టిపడేసింది. గతంలో  బోయపాటి బాలయ్య కాంబోలో వచ్చిన సింహ, లెజెండ్ సినిమాలను మించి అఖండ సినిమా అఖండ విజయం ఆడుకుంది. ఇక ఇప్పుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సీమ చేస్తున్నారు బాలకృష్ణ. క్రాక్ సినిమాతో హిట్ అందుకున్న  గోపీచంద్ మలినేని ఇప్పుడు బాలకృష్ణ కోసం పవర్ ఫుల్ కథను సిద్ధం చేశారు. ఈ సినిమాలో బాలయ్య సరసన అందాల భామ శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇటీవలే ఈ మూవీ పూజాకార్యక్రమాలతో మొదలైంది.

అలాగే క్రాక్ సినిమాలో జయమ్మగా అదరగొట్టిన వరలక్ష్మి శరత్ కుమార్ ఇప్పుడు బాలయ్య సినిమాలోనూ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా తర్వాత బాలయ్య సక్సెస్ ఫుల్ దర్శకుడు అనీల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు. బాలకృష్ణ తో సినిమా చేయడానికి అనీల్ ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నాడు. అయితే బాలకృష్ణ కోసం అనీల్ యాక్షన్ ఎంటర్టైనర్ కథ రాశాడా లేక తనకు కలిసొచ్చిన కామెడీ ఎంటర్టైనర్ కథను సిద్ధం చేశాడా తెలియాల్సి ఉంది. ఆలాగే సంపత్ నంది దర్శకత్వంలోనూ ఓ సినిమా చేయనున్నాడు బాలయ్య. వీటితోపాటు డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. గతంలో ఈ ఇద్దరి కాంబోలో పైసా వసూల్ సినిమా వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు. ఆ సమయంలోనే మరో సినిమా చేస్తానని అన్నాడు పూరీ. అయితే వచ్చే ఏడాది ఈ కాంబో సెట్స్ మీదకు వస్తుంది అంటున్నారు. ప్రస్తుతం పూరీ విజయ్ దేవరకొండ హీరోగా లైగర్ సినిమా చేస్తున్నాడు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Siri-Srihan: ఇన్‏స్టాలో సిరి ఫోటోలను డిలీట్ చేసిన శ్రీహాన్.. బ్రేకప్ దిశగా లవ్ బర్డ్స్ ?..

పీఎం మోడీకి భద్రత కల్పించకపోవడంపై మండిపడిన కంగనా.. ఇది ప్రజాస్వామ్యంపై దాడి అంటూ విమర్శలు

Acharya: ఆచార్య స్పెషల్ సాంగ్ పై వివాదం.. ఆ లిరిక్ తమ మనోభావలను దెబ్బతీసిందంటూ..