Unstoppable with NBK: సరికొత్త రికార్డు సాధించిన బాలయ్య టాక్ షో.. దేశంలోనే నెంబర్ వన్ గా అన్ స్టాపబుల్..

నటసింహం నందమూరి బాలకృష్ణ ఓవైపు హీరోగా నటిస్తునే మరో వైపు హోస్ట్ గాను అదరగొడుతున్నారు. రీసెంట్ గా అఖండ గా గర్జించిన బాలయ్య. 

Unstoppable with NBK: సరికొత్త రికార్డు సాధించిన బాలయ్య టాక్ షో.. దేశంలోనే నెంబర్ వన్ గా అన్ స్టాపబుల్..
Nbk

Updated on: Jan 11, 2022 | 4:43 PM

Unstoppable with NBK: నటసింహం నందమూరి బాలకృష్ణ ఓవైపు హీరోగా నటిస్తునే మరో వైపు హోస్ట్ గాను అదరగొడుతున్నారు. రీసెంట్ గా అఖండ గా గర్జించిన బాలయ్య. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా కోసం హోస్ట్ గా మారి అన్ స్టాపబుల్ షోతో ఆకట్టుకుంటున్నారు. మొదటిసారి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న టాక్ షో కావడంతో ఈ షో భారీ రేటింగ్ తో దూసుకుపోతుంది. బాలయ్య గెస్ట్ లుగా వచ్చిన స్టార్స్ తో తనదైన స్టైల్ లో సందడి చేస్తున్నారు. ఇప్పటి వరకు ఈ షో ఎనిమిది ఎపిసోడ్స్ ను పూర్తి చేసుకుంది. ఈ షోను బాలయ్య తనదైన శైలిలో నడిపిస్తూ ఆకట్టుకుంటున్నారు. మొదటి షో నుంచి అన్ స్టాపబుల్ గా సాగుతుంది ఈ టాక్ షో. మొదటి షోకు గెస్ట్ గా కలెక్షన్ కింగ్ మోహన్ బాబు హాజరయ్యారు. ఆ తర్వాత నాని బ్రహ్మానందం, అనీల్ రావిపూడి, సుకుమార్, రష్మిక మందన్న, అల్లు అర్జున్, రవితేజ , గోపీచంద్ మలినేని, రానా, మహేష్ బాబు ఇలా చాలా మంది స్టార్స్ ఈ షోకు హాజరయ్యి ఆకట్టుకున్నారు.

ఇక అన్ స్టాపబుల్ షో మరో రికార్డ్ ను తన ఖాతాలో వేసుకుంది. ఇండియాలోనే నెంబర్ వన్ టాక్ షోగా నిలిచింది బాలయ్య అన్ స్టాపబుల్.  ఇంటర్నెట్ మూవీ డేటాబేస్ (ఐఎండీబీ) ఇండియా టాక్ షోలపై నిర్వహించిన సర్వేలో బాలయ్య ‘అన్ స్టాపబుల్’ మొదటి స్థానంలో నిలిచింది. 9.7 పాయింట్లతో ఈ షో టాప్ లో ఉంది. ఆ తర్వాత  బాలీవుడ్ లో కపిల్ శర్మ నిర్వహిస్తున్న ‘ది కపిల్ శర్మ షో’ నిలిచింది. ఈ షో 7.8 పాయింట్లు దక్కించుకుంది. ఇదిలా ఉంటే అందాల భామ ఐశ్వర్య రాయ్ నిర్వహిస్తున్న ‘అమెజాన్ ఫ్యాషన్ అప్’ షో 4.9 పాయింట్లతో పదో స్థానంలో నిలిచింది. మొత్తంగా బాలయ్య అన్ స్టాపబుల్ షో  ఇండియాలోనే నెంబర్ వన్ టాక్ షోగా అగ్రస్థానంలో నిలిచింది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Pushpa: అల్లు అర్జున్ నిజంగా అదరగొట్టేశాడు .. పుష్ప సినిమా పై తమిళ్ స్టార్ హీరో కార్తీ ఇంట్రస్టింగ్ కామెంట్స్..

సినిమాతారలను వదలని మహమ్మారి.. వరుసగా కరోనా బారిన పడుతున్న మూవీ స్టార్స్.. ఆందోళనలో అభిమానులు

Viral Photo: ఈ ఫోటోలోని చిన్నారి ఓ కల్ట్ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.. ఎవరో గుర్తుపట్టారా..?

Kiren Rijiju: అతనిది నీచమైన మనస్తత్వం.. సిద్ధార్థ్‌ అసభ్యకర వ్యాఖ్యలపై కేంద్రమంత్రి కిరణ్ రిజిజు ఫైర్..

 

Follow Us