NBK 107 Movie: బాలయ్య సినిమాతో మరో కన్నడ హీరో తెలుగులో స్థిరపడనున్నాడా..?

నటసింహ నందమూరి బాలకృష్ణ రీసెంట్ గా అఖండ సినిమాతో సంచలన విజయాన్ని అందుకొన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయన అదే స్పీడ్ తో తన నెక్స్ట్ సినిమాను పట్టాలెక్కించారు

NBK 107 Movie: బాలయ్య సినిమాతో మరో కన్నడ హీరో తెలుగులో స్థిరపడనున్నాడా..?
Nbk 107

Updated on: Mar 18, 2022 | 4:45 PM

NBK 107 Movie: నటసింహ నందమూరి బాలకృష్ణ రీసెంట్ గా అఖండ సినిమాతో సంచలన విజయాన్ని అందుకొన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయన అదే స్పీడ్ తో తన నెక్స్ట్ సినిమాను పట్టాలెక్కించారు. సక్సెస్ ఫుల్ దర్శకుడు గోపీచంద్ మలినేనితో  హై ఇంటెన్స్ మాస్, కమర్షియల్ ఎంటర్టైనర్ లో నటిస్తున్న బాలయ్య.  ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్లో జరుగుతోంది. ఈ షూటింగ్ లో ప్రధాన తారాగణం పాల్గొంటుంది. NBK107 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలయ్య రోల్ చాలా డిఫరెంట్ గా ఉండనుంది. ఇటీవలే విడుదలైన ఈ సినిమాలో బాలయ్య ఫస్ట్ లుక్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ లుక్ చూస్తుంటే బాలయ్య ఎప్పటిలానే అదరగొట్టారు.

ఇక ఈ మాస్ మసాలా మూవీలో కన్నడ స్టార్ దునియా విజయ్ విలన్ గా నటిస్తున్నారు. ఈ సినిమాతో ఆయన తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నారు. ముసలి మడుగు ప్రతాప్ రెడ్డిగా దునియా విజయ్ నటిస్తున్నారు. తాజాగా ఆయన పాత్రను పరిచయం చేస్తూ, ఈ చిత్రం నుండి అతని ఫస్ట్ లుక్  విడుదల చేశారు.  పోస్టర్లో రఫ్ గానూ సీరియస్లుక్ గెటప్ లో కనిపించాడు విజయ్. ఆయన గెటప్ తో సినిమాలో ఆయన నటిస్తున్న పవర్ఫుల్ రోల్ని తెలియజేస్తుంది. దునియా విజయ్ ఇప్పటికే షూట్లో జాయిన్ అయ్యాడు. ఈ సినిమా తర్వాత దునియా విజయ్ తెలుగులో స్థిరపడటం ఖాయం అంటున్నారు విశ్లేషకులు. గతంలో సుధీప్ కూడా తెలుగులో విలన్ గా ఎంట్రీ ఇచ్చి మంచి క్రేజ్ సొంతం చేసుకున్నారు. ఇప్పుడు దునియా విజయ్ కూడా ఇక్కడ క్రేజీ ఆఫర్లు అందుకునే అవకాశం ఉందంటున్నారు.

టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ ప్రాజెక్ట్ను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. బాలకృష్ణ సరసన శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు. నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. గోపీచంద్ మలినేని చిత్రాలు సాంకేతికంగా ఉన్నత స్థాయిని కలిగి ఉంటాయి. ఎస్ తమన్ సంగీతం సమకూరుస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Kashmir Files: కశ్మీర్‌ ఫైల్స్‌ చిత్ర దర్శకుడికి భద్రత పెంపు.. వై క్యాటగిరీ కల్పిస్తూ అధికారుల నిర్ణయం..

Prabhas: మారుతి సినిమాకు ప్రభాస్‌ అన్ని కోట్లు తీసుకుంటున్నారా.? రోజుకు ఏకంగా కోటి రూపాయల పైమాటే..

Bheemla Nayak Aha: ఆహాలో పవర్ స్ట్రోమ్.. స్ట్రీమింగ్‏కు సిద్ధమైన బ్లాక్ బస్టర్ భీమ్లా నాయక్..

 

 

Follow Us