Nagarjuna: “అందుకే రాజమౌళికి ఆ పేరు వచ్చింది”.. కింగ్ నాగార్జున ఇంట్రెస్టింగ్ కామెంట్స్

బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్  క‌పూర్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ బ్రహ్మాస్త్ర. ఈ సినిమాను తెలుగులో బ్రహ్మాస్త్రం అనే టైటిల్ తో రిలీజ్ చేయనున్నారు. 

Nagarjuna: అందుకే రాజమౌళికి ఆ పేరు వచ్చింది.. కింగ్ నాగార్జున ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Nagarjuna
Follow us

|

Updated on: Sep 04, 2022 | 9:25 AM

బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్  క‌పూర్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ బ్రహ్మాస్త్ర. ఈ సినిమాను తెలుగులో బ్రహ్మాస్త్రం అనే టైటిల్ తో రిలీజ్ చేయనున్నారు.  అయాన్ ముఖ‌ర్జీ ద‌ర్శ‌క‌త్వంలో భారీ బ‌డ్జెట్, హై టెక్నిక‌ల్ వేల్యూస్‌తో రూపొందుతోన్న పాన్ ఇండియా మూవీఇది. ఈ సినిమాలో అందాల భామ  అలియా భ‌ట్ హీరోయిన్‌గా నటిస్తోంది. స్టార్ స్టూడియోస్‌, ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్‌, ప్రైమ్ ఫోక‌స్‌, స్టార్ లైట్ పిక్చ‌ర్స్ బ్యానర్స్‌పై రూపొందుతోన్న ఈ భారీ చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా హిందీ, తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మల‌యాళ భాష‌ల్లో సెప్టెంబ‌ర్ 9న గ్రాండ్ లెవ‌ల్లో రిలీజ్ అవుతుంది. అలాగే ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, నాగార్జున, మౌని రాయ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా చిత్రయూనిట్ ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేసింది ఈ సందర్భంగా కింగ్ నాగార్జున మాట్లాడుతూ..

రాజమౌళిగారు ఈవెంట్ ఆర్గ‌నైజ్ చేస్తున్నారు. ఎలా ఉంటుందోన‌నిపించింది. అలాగే తార‌క్ ఈవెంట్‌కి వ‌స్తున్నాడంటే క్రేజ్‌, ఫ్యాన్స్ ఎలా ఉంటుందోన‌ని మ‌న‌సులో ఊహించుకున్నాను. సెప్టెంబ‌ర్ 2.. నా అన్న హ‌రికృష్ణ‌గారి పుట్టిన రోజు. నందమూరి తార‌క రామారావుగారి బిడ్డ‌.. ఆయ‌న బిడ్డ నంద‌మూరి తార‌క రామారావు ఇక్కడకు వచ్చాడు. నా బిడ్డ ముందు నా అన్న‌కు ఓ సారి హ్యాపీ బ‌ర్త్ డే చెప్పుకుంటున్నాను అని అన్నారు. రాజ‌మౌళిగారు బ్ర‌హ్మాస్త్ర సినిమాను స‌మ‌ర్పిస్తున్నారంటే ఏదో ఊర‌క‌నే కాదు.. అయాన్ ఆల్ రెడీ స్క్రిప్ట్ చెప్పారు. నాలుగేళ్ల ముందు నుంచి రాజ‌మౌళిగారు ఈ జ‌ర్నీలో భాగ‌మై ఉన్నారు. సాధార‌ణంగా నేను రాజ‌మౌళిగారే సినిమాను మూడు నాలుగేళ్ల పాటు తెర‌కెక్కిస్తారు అనుకున్నా… సినిమాను చెక్కుతుంటారు కాబ‌ట్టే జ‌క్క‌న్న అనే పేరు వ‌చ్చింది. ఇప్పుడు త‌న ప్ర‌తి రూపంగా అయాన్ క‌నిపిస్తున్నారు. నేను చూసినంత వ‌ర‌కు బ్ర‌హ్మాస్త్ర విజువ‌ల్‌గా అంద‌రినీ ఆశ్చ‌ర్య‌పరుస్తుంది. అంద‌రికీ వండ‌ర్‌ఫుల్ జ‌ర్నీగా.. విజువ‌ల్ ట్రీట్‌గా అనిపిస్తుంది. మౌనీ రాయ్ అద్భుతంగా న‌టించింది. ర‌ణ్‌భీర్ క‌పూర్ – ఆలియా భ‌ట్‌ల‌ను చిన్న‌ప్ప‌టి నుంచి చూస్తున్నాను. ఇప్పుడు నా స్నేహితుల‌య్యారు. మంచి టాలెంటెడ్ ఉన్న ఆర్టిస్టులు. అందుకే వారిద్ద‌రూ ఒక్క‌ట‌య్యారు. టాలెంట్‌ను ఎలా ఎంపిక చేసుకోవాలి.. ఎలా ఎంక‌రేజ్ చేయాలో క‌ర‌ణ్ జోహార్‌కు చాలా బాగా తెలుసు. ఇప్ప‌టి వ‌ర‌కు రిలీజ కాన‌టువంటి భారీ చిత్రంగా బ్ర‌హ్మాస్త్ర ఉండ‌బోతుంది. భారీ రేంజ్లో విడుద‌ల‌వ కానుంది’’ అని నాగ్ అన్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో