Love Story: అభిమానులకు మళ్లీ షాకిచ్చిన నాగచైతన్య.. లవ్ స్టోరీ రిలీజ్ ఇప్పట్లో లేనట్లే..

వచ్చినట్లే వచ్చి.. మళ్లీ వెనక్కు వెళ్లిపోతున్నాయి కొన్ని సినిమాలు. గత కొద్ది రోజులుగా చిత్రాల విడుదల విషయంలో తర్జనా భర్జన పడుతున్న

Love Story: అభిమానులకు మళ్లీ షాకిచ్చిన నాగచైతన్య.. లవ్ స్టోరీ రిలీజ్ ఇప్పట్లో లేనట్లే..
Love Story

Updated on: Aug 27, 2021 | 7:28 PM

వచ్చినట్లే వచ్చి.. మళ్లీ వెనక్కు వెళ్లిపోతున్నాయి కొన్ని సినిమాలు. గత కొద్ది రోజులుగా చిత్రాల విడుదల విషయంలో తర్జనా భర్జన పడుతున్న మేకర్స్ ఇప్పటికీ ఏటు తెల్చుకోలేకపోతున్నారు. సెకండ్ వేవ్ అనంతరం థియేటర్లు తెరుచుకుని.. పలు సినిమాలు సూపర్ హిట్ అందుకున్నా.. ఇంకా తమ సినిమాలు విడుదల విషయంలో మేకర్స్ సందేహాలు మాత్రం వీడడం లేదు. ఇప్పటికే గల్లి రౌడీ సినిమా వాయిదా పడగా.. మరో మూవీ కూడా వెనక్కు తగ్గింది. నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తోన్న లవ్ స్టోరీ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గతంలోనే ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా.. కోవిడ్ కారణంగా ఈ మూవీ వాయిదా పడింది. ఇక ఆ తర్వాత థియేటర్లలో నాలుగు షోలు వేసినప్పుడు మాత్రమే లవ్ స్టోరీ మూవీ విడుదల చేస్తాం అని మేకర్స్ తెలిపారు. దీంత లవ్ స్టోరీ సినిమా విడుదల పై విభిన్న రకాలుగా టాక్ వినిపించింది. దీంతో సినిమా రిలీజ్ విషయంలో వస్తున్న రూమర్లకు చెక్ పెడుతూ.. ఇటీవల లవ్ స్టోరీ సినిమాను వినాయక చవితి సందర్భంగా థియేటర్లలో సెప్టెంబర్ 10న విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించిన సంగతి తెలిసిందే.

కానీ తాజాగా ఈ సినిమా విషయంలో మరోసారి మేకర్స్ వెనక్కి తగ్గినట్లుగా తెలుస్తోంది. శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఈ సినిమాను సెప్టెంబర్ 10న విడుదల చేయవద్దని భావిస్తున్నారట మేకర్స్ . ఆంధ్రప్రదేశ్‏లో థియేటర్ల సమస్యల పరిష్కారంలో పురోగతి లేనందున రిలీజ్ వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్న లవ్ స్టొరీ యూనిట్.

Also Read: Allu Arha: డాటర్ క్యూట్ వీడియో షేర్ చేసిన బన్నీ.. అర్హ చేష్టలకు ఫిదా కావాల్సిందే.. మీరు ఓ లుక్కెయ్యండి..

Ichata Vahanamulu Nilupa Radu Review: ఇచ్చట వాహనములు నిలుపరాదు… ఒకవేళ నిలిపితే జరిగేది ఇదే!

Tuck Jagadish: ఎన్నెన్నో అనుకుంటాం.. అన్ని జరుగుతాయా ?.. ఫ్యాన్స్‏ను నిరుత్సాహపరిచిన నాని ప్రకటన..

Sridevi Soda Center Review: సూరిబాబు లైటింగ్‌.. సోడాల శ్రీదేవి అల్లరి.. కాశీ పెంచుకున్న పగ.. శ్రీదేవి సోడా సెంటర్‌ ఇంతకీ ఎలా ఉందంటే?

Loading...
Unable to load recommendations.
Follow Us