
Naga Shourya 20th Movie : యంగ్ హీరో నాగశౌర్య హీరోగా సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కబోతుంది. శ్రీ వేంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. నాగశౌర్య 20వ చిత్రంగా వస్తోన్న ఈ మూవీ ప్రి లుక్ ను తాజాగా విడుదల చేసింది చిత్ర యూనిట్. సూపర్ ఫిట్ గా వెనుకనుండి కనిపిస్తున్న నాగశౌర్య లుక్ కు విశేష స్పందన లభించింది. దీంతో ఫస్ట్ లుక్ మీద అంచనాలు పెరిగాయి. ప్రతి సినిమాలో విభిన్నత ఉండేలా చూసుకునే నాగశౌర్య.. ఛలో, ఓ బేబీ, అశ్వద్ధామ వంటి వరస సినిమాలతో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. కాగా తాజా మూవీ ఫస్ట్ లుక్ ను సక్సెస్ ఫుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల జూలై 27న ఉదయం 9 గం లకు రిలీజ్ చేయనున్నారు. ఆసక్తికరమైన ప్రాచీన విలువిద్య నేపథ్యంలో ఈ మూవీ ఉంటుందని సమాచారం. ప్రస్తుతం ఈ చిత్రం ప్రొడక్షన్ స్టేజ్ లో ఉంది. ఇతర నటీనటులు, సాంకేతిక వర్గం వివరాలను త్వరలోనే తెలియజేయనున్నారు.
ఇది కూడా చదవండి : ఆగస్టు నెలకు సంబంధించి శ్రీవారి ప్రత్యేక దర్శన టికెట్లు విడుదల..