ఎన్నోనిరాశలు, అపజయాలను ఎదుర్కున్నాడు.. కొడుకు విజయం పై నాగబాబు ఎమోషనల్ పోస్ట్

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ‘కొరియన్ కనకరాజు’తో ప్రేక్షకులను అలరిస్తుంది. తాజాగా విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ హారర్ కామెడీ సూపర్‌నేచురల్ ఎలిమెంట్స్, నవ్వులు పంచే వినోదంతో గొప్ప థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తుంది.

ఎన్నోనిరాశలు, అపజయాలను ఎదుర్కున్నాడు.. కొడుకు విజయం పై నాగబాబు ఎమోషనల్ పోస్ట్
Nagababu, Varuntej

Updated on: Aug 09, 2026 | 11:32 AM

మెగా హీరో వరుణ్ తేజ్ ఎట్టకేలకు హిట్ అందుకున్నాడు. గద్దలకొండ గణేష్ సినిమా తర్వాత ఆ రేంజ్ హిట్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నాడు. ఎట్టకేలకు తాజాగా కొరియన్ కనకరాజు సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్నాడు. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించగా, వరుణ్ తేజ్, రితిక నాయక్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రంలో సత్య, మురళీధర్ గౌడ్ తదితరులు నటించారు. దీనికి ఎస్. థమన్ సంగీతం అందించారు. తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. సినిమాకు మంచి రెస్పాన్స్ రావడంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. వరుణ్ తేజ్ హిట్ పై నాగబాబు ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు.

నాగబాబు సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్ట్ లో ఏముందంటే.. వరుణ్ తేజ్ విజయంపై ఐదేళ్లుగా అన్నీ చూస్తూ నిశ్శబ్దంగా అండగా నిలిచానని నాగబాబు భావోద్వేగంగా తెలిపారు. ఈ ఐదేళ్లలో తన కుమారుడు వరుణ్ తేజ్ ఎన్నో బాధలు, నిరాశలు, అపజయాలను ఎదుర్కొన్నాడని పేర్కొన్నారు. విజయాలు లేకపోయినా.. ప్రతి అపజయం అతడిని మరింతగా పరీక్షించిందని, అయినా ప్రయత్నించడం మాత్రం ఎప్పుడూ ఆపలేదన్నారు. వరుణ్ ఎంత బాధపడుతున్నాడో చెప్పకపోయినా.. తండ్రిగా తనకు తెలుసని నాగబాబు తెలిపారు. తండ్రీకొడుకులు ఒకరినొకరు మాటలు లేకుండానే అర్థం చేసుకునేవారని, ఎన్నో సందర్భాల్లో మౌనంగానే ఒకరికొకరు ధైర్యం చెప్పుకున్నామని చెప్పారు.

ఇవి కూడా చదవండి

వరుణ్‌లో ఉన్న పోరాట స్ఫూర్తిని, ఆశను, ముందుకు సాగాలనే పట్టుదలను ఎప్పుడూ గమనించానన్నారు. ఐదేళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత ఇప్పుడు పరిస్థితులు మారాయని.. ‘కొరియన్ కనకరాజు’ బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఈ విజయం పూర్తిగా వరుణ్ తేజ్‌దేనని నాగబాబు స్పష్టం చేశారు. తన కెరీర్‌లో తాను ఎప్పుడూ జోక్యం చేసుకోలేదని, ఎలాంటి క్రెడిట్ తీసుకోలేదని తెలిపారు. వరుణ్ ఎదుర్కొన్న అపజయాలు అతడివే.. అలాగే ఇప్పుడు వచ్చిన విజయం కూడా పూర్తిగా అతడిదేనని అన్నారు. తన చిన్నబ్బాయి వరుణ్ తేజ్‌కు ప్రేమతో అభినందనలు తెలిపారు. “నా బేబీ బాయ్ గురించి చాలా గర్వంగా ఉంది” అంటూ భావోద్వేగం వ్యక్తం చేశారు. ‘కొరియన్ కనకరాజు’ విజయంలో భాగమైన దర్శకుడు గాంధీ మెర్లపాక, సత్య, రితికా నాయక్, నిర్మాత రాజీవ్, థమన్‌తో పాటు చిత్ర యూనిట్ మొత్తానికి నాగబాబు హృదయపూర్వక ఆశీస్సులు, అభినందనలు తెలిపారు.
కథపై నమ్మకంతో అందరూ కలిసి పనిచేయడం వల్లే ఈ విజయం సాధ్యమైందని పేర్కొన్నారు. “ఈ రోజు మీ విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం.. ఇంకా వెలుగుతూ ఉండాలి బంగారు. ఇది నీ సమయం” అంటూ వరుణ్ తేజ్‌కు నాగబాబు విషెస్ తెలిపారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us