Kiran Abbavaram : కుర్ర హీరోతో టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ.. కిరణ్ అబ్బవరం దశ తిరిగినట్టే..

ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ నిర్మాణ సంస్థగా దూసుకుపోతున్న వాటిలో మైత్రి మూవీ మేకర్స్ ఒకరు. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన శ్రీమంతుడు సినిమాతో ఒక్కసారిగా టాలీవుడ్ లోకి భారీ ఎంట్రీ ఇచ్చిన ఈ నిర్మాణ సంస్థ

Kiran Abbavaram : కుర్ర హీరోతో టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ.. కిరణ్ అబ్బవరం దశ తిరిగినట్టే..
Kiran Abbavaram

Updated on: Mar 10, 2022 | 8:16 AM

Kiran Abbavaram : ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ నిర్మాణ సంస్థగా దూసుకుపోతున్న వాటిలో మైత్రి మూవీ మేకర్స్ ఒకరు. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన శ్రీమంతుడు సినిమాతో ఒక్కసారిగా టాలీవుడ్ లోకి భారీ ఎంట్రీ ఇచ్చిన ఈ నిర్మాణ సంస్థ ఆతర్వాత వరుస సినిమాలతో దూసుకుపోయింది. ఇక స్టార్ హీరోల సినిమాలతోపాటు కుర్ర హీరోల సినిమాలను కూడా తెరకెక్కిస్తూ తన సత్తా చాటుకుంటుంది మైత్రి మూవీ మేకర్స్. రీసెంట్ గా పుష్ప సినిమాతో భారీ హిట్ అందుకున్న ఈ సంస్థ ఇప్పుడు ఓ కుర్ర హీరోతో సినిమా చేయడానికి సిద్ధం అయ్యింది. ఆ హీరో ఎవరంటే ‘రాజావారు రాణిగారు’ సినిమాతో తెలుగు తెరకు హీరోగా  పరిచయమైన యంగ్ హీరో కిరణ్‌ అబ్బవరం. తొలి సినిమాతో తనకంటూ మంచి పేరు తెచ్చుకున్నారు. రెండో చిత్రం ‘ఎస్‌.ఆర్‌. కళ్యాణమండపం’తో సాలిడ్‌ సక్సెస్‌ అందుకున్నారు. క్లాసు – మాసు, యూత్‌ – ఫ్యామిలీ… ఇలా అన్ని వర్గాల ప్రేక్షకుల్లో అభిమానులను సొంతం చేసుకున్నారు.

రీసెంట్ గా సెబాస్టియన్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ఈ యంగ్ హీరో. ఈ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు మైత్రి మూవీస్ తో కలిసి ఓ భారీ సినిమా చేయడానికి రెడీ అయిపోయాడు కిరణ్. ఈ హీరోతో 9 కోట్లతో ఓ మూవీ చేయడానికి మైత్రీ మూవీ మేకర్స్ రెడీగా వుండటం ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. త్వరలోనే ఈ సినిమాను అనౌన్స్ చేయనున్నారు. ఇదిలా ఉంటే మైత్రి వారసుల సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. ఇప్పటికే పుష్ప 2 , మహేష్ సర్కారువారి పాట, సుధీర్ బాబు ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, బాలకృష్ణ 107వ సినిమా, మెగాస్టార్ బాబీ మూవీ ఇలా వరుస సినిమాలను చేస్తుంది మైత్రి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Malavika Mohanan: చీరకట్టులో అందాల విస్ఫోటనం.. మాళవిక మోహనన్ మైండ్ బ్లోయింగ్ పిక్స్

Viral Photo: భూమి మీదకు వచ్చిన ఊర్వశి.. చూపు తిప్పుకోనివ్వని అందాల రాశి.. టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. గుర్తుపట్టండి..

Kriti Sanon: నాజూకైన ఒంపుసొంపులతో అభిమానుల హృదయాలను కొల్లగొడుతున్న కృతి సనన్

Loading...
Unable to load recommendations.
Follow Us