AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vikarabad: హమ్మయ్య మిస్టరీ వీడింది.. పంటపొలాల్లో ఆకాశం నుంచి పడ్డ వింత పరికరం ఏంటంటే..?

వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం మొగిలిగుండ్లలో ల్యాండ్ అయిన ‘ఆదిత్య 369’ సినిమాలో మాదిరిగా ఉన్న గుండ్రని భారీ శకటం మిస్టరీ వీడింది.

Vikarabad: హమ్మయ్య మిస్టరీ వీడింది.. పంటపొలాల్లో ఆకాశం నుంచి పడ్డ వింత పరికరం ఏంటంటే..?
Mysterious Object in Vikarabad
Ram Naramaneni
|

Updated on: Dec 07, 2022 | 4:04 PM

Share

సైన్స్ ఫిక్షన్‌ ఆదిత్య 369 మూవీ లాగే ఆదిత్య 2022 మెషిన్ అంతు చిక్కని మిస్టరీగా మారింది. ఆకాశంలో మిల మిల మెరుపులా మెరిసిన ఓ విచిత్ర దృశ్యం.. ఒక్కసారిగా భూమిపై పడిపోయింది. ఇది ఇంచు మించు ఆదిత్య 369 మూవీలోని టైమ్‌ మెషిన్‌లాగే ఉంది. వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం మొగిలిగుండ్లలో ప్రత్యక్షమైన వింత మెషీన్ కొన్ని గంటల పాటు జనాన్ని వణికించింది. అచ్చు ఆదిత్య 369 సినిమా తరహాలో ఉందీ మెషిన్‌. నేలను తాకేలా ఉన్న డోర్‌.. చుట్టూ అద్దాలను తలపించే కిటికీలు.. బెలూన్ ఆధారంగా వచ్చి నేలపై వాలిందీ శకటం. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియక జనం టెన్షన్ పడ్డారు. గ్రహాంతర శకటం అంటూ జోరుగా చర్చ జరిగింది.

ఈ వింత మెషీన్‌ను చూసేందుకు జనాలు భారీ ఎత్తున తరలివచ్చారు. రెండు గంటల పాటు నింగిలో చక్కర్లు కొట్టి ఆ తర్వాత నేలపై కుప్పకూలిపోయింది. జనాల్లో భయాందోళనలతో అధికారులు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. వికారాబాద్‌లో ల్యాండ్ అయ్యింది హలో స్పేస్‌ మెషిన్‌ తాలూకా రీసెర్చ్‌ హీలియం బెలూన్‌ అని స్పష్టం చేశారు. స్పెయిన్ మ్యాడ్రిడ్‌లో ఏర్పాటైన సంస్థ.. స్పేస్ టూరిజం కోసం జరుగుతున్న ప్రయోగాల్లో ఇదీ ఒకటని తేల్చారు. బెలూన్‌ ఫెసిలిటీ ఆఫ్‌ టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫండమెంటల్‌ రీసెర్చ్‌ ఆధ్వర్యంలో దీన్ని పంపినట్లు తెలిపారు. ఈ  ప్రయోగం భారత ప్రభుత్వం సహాకారంతోనే జరిగినట్లు స్పష్టం చేశారు.

ఐదు రోజులు స్పేస్‌లో ఉండేలా ఈ ప్రయోగం జరిగింది. భయాందోళనల మధ్య అధికారులు ప్రయోగమని క్లారిటీ ఇవ్వడంతో జనం ఊపిరి పీల్చుకున్నారు. అయితే  ఇంత భారీ ఆకారం, బరువున్న మెషీన్ ఇళ్లపైనో, జనం పైనో పడితే పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Follow Us
రాత్రి నిద్రపోయే ముందు ఈ 2 పనులు చేశారంటే.. మీ జుట్టు వద్దంటే
రాత్రి నిద్రపోయే ముందు ఈ 2 పనులు చేశారంటే.. మీ జుట్టు వద్దంటే
నెమలి కూస్తే నిజంగానే వర్షం పడుతుందా..? ఈ నమ్మకం వెనుక ఉన్న..
నెమలి కూస్తే నిజంగానే వర్షం పడుతుందా..? ఈ నమ్మకం వెనుక ఉన్న..
సామాన్యులకు బ్యాడ్ న్యూస్.. తగ్గని షుగర్ ధరలు..
సామాన్యులకు బ్యాడ్ న్యూస్.. తగ్గని షుగర్ ధరలు..
పెళ్లై ఆరు నెలలు.. భార్యను చంపి.. ఫ్రిజ్‌లో దాచిపెట్టిన భర్త..!
పెళ్లై ఆరు నెలలు.. భార్యను చంపి.. ఫ్రిజ్‌లో దాచిపెట్టిన భర్త..!
వారసులకు అప్పగించే ఆస్తులపై ట్యాక్స్ ఉంటుందా..? ఐటీ రూల్స్ ఇవే..
వారసులకు అప్పగించే ఆస్తులపై ట్యాక్స్ ఉంటుందా..? ఐటీ రూల్స్ ఇవే..
ఓటీటీలో ఈ సినిమాను అస్సలు మిస్సవ్వకండి.. పిచ్చెక్కించే ట్విస్టులు
ఓటీటీలో ఈ సినిమాను అస్సలు మిస్సవ్వకండి.. పిచ్చెక్కించే ట్విస్టులు
ఆండ్రాయిడ్ లోగో ఆకుపచ్చ రోబోట్‌లా ఎందుకు ఉంటుంది?
ఆండ్రాయిడ్ లోగో ఆకుపచ్చ రోబోట్‌లా ఎందుకు ఉంటుంది?
ఫ్లోరిడా సముద్రంలో షార్క్ దాడి.. అంతలో హీరోలా దూకి..
ఫ్లోరిడా సముద్రంలో షార్క్ దాడి.. అంతలో హీరోలా దూకి..
రెండు గుప్పెళ్ళు తింటే.. విరిగిన ఎముకలు ఉక్కులా మారతాయి
రెండు గుప్పెళ్ళు తింటే.. విరిగిన ఎముకలు ఉక్కులా మారతాయి
తిరుమల వెళ్లే శ్రీవారి భక్తులకు రైల్వేశాఖ గుడ్ న్యూస్
తిరుమల వెళ్లే శ్రీవారి భక్తులకు రైల్వేశాఖ గుడ్ న్యూస్