
వెర్సటైల్ యాక్టర్ జేడీ చక్రవర్తి ప్రధాన పాత్రలో మరో కొత్త సినిమాతో అడియన్స్ ముందుకు రాబోతున్నారు. రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రానికి ‘‘చేతబడి” అనే టైటిల్‌ను రివీల్ చేశారు. ప్రముఖ నిర్మాణ సంస్థలు M3 Media, మహా మూవీస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. మహర్షి కూండ్ల ప్రెజెంట్స్‌లో రూపొందుతున్న ఈ చిత్రానికి సూర్యాస్ రచన, దర్శకత్వం వహిస్తుండగా, మహేంద్ర నాథ్ కూండ్ల నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అచ్చు రాజమణి సంగీతం అందిస్తున్నారు. ప్రముఖ గీత రచయిత చంద్రబోస్ కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగమవడం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. సినిమాటోగ్రఫీ మిర్లాన్ నసీర్, ఎడిటింగ్ వంశీ నిర్వహిస్తున్నారు. రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా బాణామతి బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఈ ఆసక్తికరమైన చిత్రం హారర్, మిస్టరీ ఎలిమెంట్స్‌తో ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేసేలా ఉంటుంది. ఇప్పటికే విడుదలైన ప్రీ లుక్ పోస్టర్‌తో సినిమాపై ఆసక్తి పెరిగింది.
ఎక్కువ మంది చదివినవి : Folk Song: ఏముంది రా బాబూ ఈ సాంగ్.. యూట్యూబ్‌లో దుమ్మురేపుతున్న ఫోక్ సాంగ్.. కుర్రాళ్లు ఫిదా అయిన పాట..
ఏప్రిల్ 16న వెర్సటైల్ యాక్టర్ జేడీ చక్రవర్తి పుట్టినరోజు సందర్భంగా ఇందులో ఆయన పోషిస్తున్న పాత్ర గురించి రివీల్ చేశారు మేకర్స్. మునుపెన్నడూ పోషించని డిఫరెంట్ అవతార్‌లో హీరోగా, విలన్‌గా జేడీ చక్రవర్తి కనిపించనున్నారని చిత్ర యూనిట్ తెలియజేసింది. మరోవైపు ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కాకముందే.. ఐదు భాషల ఆడియో రైట్స్‌ను మ్యూజిక్ సెన్సేషన్ సరిగమ సంస్థ దక్కించుకుంది. ఒక పాటను ఐదు భాషల్లో విడుదల చేయడం కామన్‌గా జరుగుతుంది.
ఎక్కువ మంది చదివినవి : Devaraj : ఒళ్లంతా రక్తం.. ట్రైన్లోనే స్నానం చేశా.. ఆ టాలీవుడ్ స్టార్ హీరో నాకోసం ఎంతో చేశారు.. టాలీవుడ్ నటుడు..
కానీ ఇందులో తెలుగులో ఒక పాట, మిగిలిన భాషల్లో డిఫరెంట్ సాంగ్స్, సేమ్ విజువల్‌తో రావడం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. వచ్చే నెలనుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. ఈ సినిమా టెక్నికల్‌గా కూడా హై స్టాండర్డ్స్‌లో ఉండబోతోందని యూనిట్ చెబుతోంది. బాణామతి లాంటి సున్నితమైన, నిగూఢమైన అంశాన్ని వెండితెరపై ఎలా ఆవిష్కరిస్తారో చూడాలని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఎక్కువ మంది చదివినవి : Rami Reddy : తెలుగులో పవర్ ఫుల్ విలన్.. రామి రెడ్డి చనిపోవడానికి అసలు కారణం ఇదే.. టాలీవుడ్ నటుడు..
జేడీ చక్రవర్తి.. ఒకప్పుడు తెలుగు వెండితెరపై తనదైన నటనతో మెప్పించారు. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన శివ సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత మనీ, గులాబీ, అనగనగా ఒకరోజు వంటి చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఆయన… ఇప్పుడు ఇండస్ట్రీలో సరికొత్త జానర్ చిత్రాలతో అలరించేందుకు రెడీ అయ్యారు.
ఎక్కువ మంది చదివినవి : Cinema : ఏం సినిమా రా బాబూ.. పేరుకే పక్కా కామెడీ మూవీ.. కానీ 15 ఏళ్లుగా బాక్సాఫీస్ షేక్.. ఇప్పుడు ఓటీటీలో రచ్చ..